Amitabh Bachchan: మరో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన బిగ్ బి

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనీ మానేజ్మెంట్ లో చాలా తెలివిగా ఉంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయన ఆదాయంలో ఎక్కువగా ప్రాపర్టీస్ కొనడంతోనే సరిపోయింది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఉండే జల్సా అనే తన బంగ్లా కోసం దాదాపు 50కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇక ఇంటికి పక్కనే 7 ఏళ్ల క్రితం మరొక కొత్త ప్రాపర్టీని కొన్నారు. దాని విలువ కూడా దాదాపు 50కోట్లకు పైనే ఉంటుందట.

కూతురికి కొడుక్కి అలాగే మనవరాలి పేరు మీద కూడా కొన్ని బంగ్లాలు కొన్నారు. ఇక రీసెంట్ గా కోవిడ్ కారణంగా ఒక్కసారిగా ముంబైలో రియల్ ఎస్టేట్ తగ్గిపోవడంతో అమితాబ్ బచ్చన్ రూ.31కోట్ల రూపాయలతో మరొక అపార్టుమెంట్ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. 80 ఏళ్ళ వయసులో కూడా నటుడిగా భారీ ఆదాయాన్ని అందుకుంటున్న అమితబ్ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. చాలా సందర్భాల్లో పేద రైతులను ఆదుకున్నారు. గత ఏడాది కోవిడ్ బాధితుల కోసమని భారీ విరాళాలు అంధించడమే కాకుండా ప్రత్యేకంగా పేద కళాకారుల కోసం నిత్యావసర సరుకులను కూడా అంధించాడు.

ఇక రీసెంట్ గా ముంబైలోని అంధేరిలో 5,184 చదరపు అడుగుల అపార్ట్మెంట్ ను రూ.31 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ప్రస్తుతం బిగ్ బి పలు బాలీవుడ్ సినిమాలతో పాటు ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus