Amitabh Bachchan: వేగంగా గమ్యస్థానం చేర్చావు… థాంక్యూ మిత్రమా బిగ్ బీ పోస్టు వైరల్!

  • May 15, 2023 / 08:32 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక అమితాబ్ వయసు పైబడిన ఈయన పలు బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా తెలుగు సినిమాలలో కూడా సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ షూటింగ్ విషయంలో ఎంతో క్రమశిక్షణగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సరైన సమయానికి షూటింగుకు వెళ్లడం తన పనులు సక్రమంగా చేసుకోవడం అమితాబచ్చన్ కు మొదటి నుంచి వచ్చిన క్రమశిక్షణ అని చెప్పాలి.ఇక తాజాగా ఈయన సినిమా షూటింగ్ నిమిత్తం షూటింగ్ లోకేషన్ కు బయలుదేరి వెళ్తుండగా అనుకోకుండా ట్రాపిక్ జామ్ కావడంతో ఈయన ఏమాత్రం ఆలోచించకుండా దారిన వెళ్తున్నటువంటి ఒక బైకర్ సహాయంతో ఆయన బైక్ పై తన గమ్యస్థానాన్ని చేరుకున్నారు.

ఇలా ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి బైక్ మీద (Amitabh Bachchan) అమితాబ్ బచ్చన్ వెళ్తూ తన గమ్యస్థానాన్ని చేరుకొని షూటింగ్లో పాల్గొన్నారు. ఇదే విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నువ్వు ఎవరో నాకు తెలియదు మిత్రమా.. కానీ లిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా మాట మన్నించి నేను అడిగినచోట నన్ను డ్రాప్ చేశావు. ట్రాఫిక్ జంఝాటాన్ని తప్పించి వేగంగా గమ్యస్థానానికి చేర్చావు. నీకు మరోసారి థాంక్స్ అని బిగ్ బీ పేర్కొన్నారు.

ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమిత మనవరాలు స్పందిస్తూ హార్ట్ ఎమోజి షేర్ చేశారు. తన బ్లాగ్ లో అమితాబ్ మేము చేసే పనులకు కొన్ని ప్రాంతాలలో ఆదివారం అనుమతులు తెలుపుతారు కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ కారణంగా చాలా కాలం తర్వాత బైక్ పై ప్రయాణించడం.. డ్రైవింగ్ ఉత్సాహంగా ఉంది.. ఈ రైడ్ ఎప్పటికీ మర్చిపోను అంటూ అమితాబ్ పోస్ట్ చేయడంతో నేటిజన్స్ ఈ పోస్ట్ పై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus