Amitabh: సమయం మనకోసం ఆగదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన అమితాబ్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు బిగ్ బీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 8 పదుల వయసులో కూడా ఈయన వరుస సినిమా షూటింగ్లలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ప్రస్తుత హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే బుల్లితెరపై కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అమితాబ్ తాజాగా తన పర్సనల్ బ్లాగ్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా అమితాబ్ స్పందిస్తూ ఒకానొక సమయంలో తాను జల్సాలోని నివాసంలో ఉంటున్నప్పుడు ప్రతి ఆదివారం సండే మీట్స్ అనే కార్యక్రమం ద్వారా ఆదివారం పెద్ద ఎత్తున అభిమానులను కలిసే వాడినని తెలిపారు.ఇలా తనని కలవడానికి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని కేరింతలతో ఎంతో సందడి వాతావరణం ఉండేదని తెలిపారు.

ఇక ప్రస్తుతం ఆ పరిస్థితులు ఎక్కడ కనపడడం లేదని ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఫోన్లకే పరిమితం కావడం వల్ల ఫోన్లో చిత్రాలను చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని ఈయన తెలిపారు.ఈ మధ్యకాలంలో సండే మీట్స్ కార్యక్రమానికి వచ్చే అభిమానుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని అమితాబ్ వెల్లడించారు.మునపటిలా ఎవరిలోనూ ఆ ఉత్సాహం కనిపించలేదని దీన్నిబట్టి చూస్తుంటే ఎవరికి ఏది శాశ్వతం కాదని అర్థమవుతుంది అంటూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇలా మన కోసం ఏది ఆగదని ఏదీ శాశ్వతం కాదని..ముఖ్యంగా సమయం మనకోసం ఆగదు అనే విషయం అర్థమైంది అంటూ ఈయన చేసినటువంటి ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అమితాబ్ విషయానికి వస్తే ఈయన ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ Kసినిమాలో కూడా అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus