Prabhas, Amitabh: అమితాబ్ ని ఇలా వాడేసిన ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఇటీవల ఒకరినొకరు పొగుడుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. ప్రభాస్ అతిథి మర్యాదల గురించి కూడా మాట్లాడారు అమితాబ్. ఇప్పుడు ప్రభాస్ పై తన ప్రేమను ఎలా వ్యక్తం చేశారంటే..? ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమా మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకుంటున్నాయి. అయితే ఈ సినిమాకి ఓ వాయిస్ ఓవర్ ట్రాక్ ఉంది.

Click Here To Watch

దాన్ని ఎవరితో చెప్పించాలని టీమ్ ఎంతగానో ఆలోచన చేసింది. ఫైనల్ గా ఆ కోరికను అమితాబ్ తీర్చేశారు. ‘రాధేశ్యామ్’ సినిమాకి అమితాబ్ తన వాయిస్ ఓవర్ ను అందించారు. ఈ విషయాన్ని చిత్రదర్శకుడు రాధాకృష్ణ, హీరోయిన్ పూజాహెగ్డే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ఆయ‌న త‌న నెరేష‌న్‌తో ఎపిక్ ల‌వ్ స్టోరిని మ‌రింత ఎపిక్‌గా మార్చినందుకు ధ‌న్య‌వాదాలు’ అంటూ ‘రాధేశ్యామ్’ టీమ్ అమితాబ్ కి థాంక్స్ చెప్పింది. బాలీవుడ్ వెర్షన్ కి అయితే అమితాబ్ తో చెప్పించారు..

మరి మిగిలిన భాషల్లో ఎవరెవరితో చెప్పించారో తెలియాల్సివుంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను గోపీకృష్ణా మూవీస్ రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు స‌మర్ఫ‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద నిర్మించారు. రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేశారు. ఇక ప్రస్తుతం ప్రభాస్.. అమితాబ్ తో కలిసి ‘ప్రాజెక్ట్ K’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ షూటింగ్ సెట్స్ లో ప్రభాస్ తో అమితాబ్ కి మంచి బాండింగ్ పెరిగింది. ఆ కారణంగానే ఇప్పుడు ప్రభాస్ సినిమాకి వాయిస్ ఓవర్ అందించినట్లు తెలుస్తోంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus