కండలు తిరిగిన తారక రాముడు.. వైరల్ అవుతున్న ఫోటో!

ప్రస్తుతం ఎన్టీఆర్ షర్ట్ లెస్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ పిక్ లో ఎన్టీఆర్ కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తున్నాడు. ఫోటోగ్రాఫర్ దబ్బూ రత్నా ఈ ఫోటోని షేర్ చేశాడు. తాను సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ ఫోటోని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు. తన పాతికేళ్ల సినీ కెరీర్లో సంపాదించుకున్న జ్ఞాపకాలను దబ్బూ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వస్తున్నాడు.

‘త్రీ ఇడియట్స్’ టైములో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌తో తీసుకున్న పిక్ ను.. నిన్న(ఆదివారం) షేర్ చేశాడు. అదే క్రమంలో ఎన్టీఆర్ తో తాను తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేసాడు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం తన లుక్ ను కంప్లీట్ గా మార్చేశాడు కదా..? అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఆలోచించింది కరెక్ట్.. ఈ ఫోటో ఇప్పటిది కాదు. ‘అరవింద సమేత’ చిత్రం టైంలోనిది.

ఈ విషయాన్ని ఎన్టీఆర్ సన్నిహితుడు మరియు నిర్మాత అయిన మహేష్ కోనేరు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్… కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ ఈ నెల 22న విడుదల కాబోతుంది. ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో ఈ టీజర్ విడుదల కాబోతుంది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus