Jr NTR, Koratala Siva: సముద్రం నేపథ్యంలో యాక్షన్ సీన్స్.. నెక్స్ట్ లెవెల్ అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత మరో సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా లాంఛ్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ఒక వీడియో విడుదలైంది. ఆ వీడియోలో తారక్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సముద్రం నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది.

ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఈ సీన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని సమాచారం అందుతోంది. తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమ్మర్ నాటికి ఈ సినిమాను పూర్తి చేసి తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని బోగట్టా.

ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేశారని త్వరలో హీరోయిన్ కు సంబంధించి అధికారికంగా ప్రకటిస్తారని బోగట్టా. 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ ఫైనల్ అయ్యారని బోగట్టా. తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకుంటానని తారక్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus