Brahmamudi September 21st: చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న కృష్ణమూర్తి!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే కావ్య తన పుట్టింటికి బయలుదేరుతూ తన అత్తయ్య దగ్గరికి వచ్చి పర్మిషన్ అడుగుతుంది ఇంట్లో పనులన్నీ చేసావా అని తన అత్తయ్య అడగడంతో పనులన్నీ పూర్తి చేశాను అత్తయ్య మధ్యాహ్నంకి కూడా భోజనం రెడీ చేశాను. అలాగే తాతయ్య గారికి మందులన్నీ కూడా సిద్ధం చేశాను అంటూ చెబుతుంది.

సరే వెళ్ళు అంటూ అపర్ణ పర్మిషన్ ఇవ్వడంతో కావ్య చిట్టి సీతారామయ్య వద్దకు వెళ్లి మీ ఆశీర్వాదం కావాలి అని తీసుకుంటుంది. ఎప్పుడు వెళ్తావు కదా ఇదేంటి కొత్తగా అంటూ రుద్రాన్ని అడగడంతో ఈరోజుతో మాకు కాంట్రాక్ట్ పూర్తి అవుతుంది. మా నాన్న అప్పులన్నీ తొలగిపోతాయి అని కావ్య చెబుతుంది. ఇక రాజ్ కూడా అదే సమయంలో కిందికి రావడంతో రాజ్ తనని ఇంటి దగ్గర దించేసి వెళుతున్నావు కదా అని తన తాతయ్య అడగడంతో మీరు చెప్పినప్పటి నుంచి నేను అలాగే చేస్తున్నాను తాతయ్య అంటూ ఇద్దరు కలిసి వెళ్తారు.

ఇక కావ్య కుటుంబం ఎలాగైనా ఇబ్బంది పడాలని ఆలోచిస్తున్నటువంటి రుద్రాణి తన కొడుకుకి ఫోన్ చేసి కావ్య కుటుంబం బజారున పడాలి అంటూ చెబుతుంది. ఇక విగ్రహాల వద్దకు కావ్య వెళ్లి అందరూ కలిసి బొమ్మలకు రంగులు వేస్తూ ఉంటారు. మరోవైపు కళ్యాణ్ అనామికను కలవడం కోసం వెళ్తూ ఉంటారు. అదే సమయంలో అప్పు ఫోన్ చేయగా ఆయన లిఫ్ట్ చేయరు అనామిక ఫోన్ చేయడంతో వస్తున్నానని చెప్పగా ఎవరైనా అమ్మాయిలు పిలిస్తే గంట ముందు ఉంటారు. మీరేంటి అబ్బాయి ఇలా ఆలస్యంగా వస్తున్నారు అని చెప్పడంతో ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ఆలస్యం అయింది అంటూ కళ్యాణ్ చెబుతారు.

ఇక కళ్యాణ్ అనామికను కలవడంతో అనామిక వెడ్డింగ్ కార్డు కళ్యాణ్ చేతిలో పెట్టడంతో కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి వెడ్డింగ్ కార్డ్ అని కళ్యాణ్ అనామికను అడగడంతో ఒకసారి చూడు అన్నగా చూడటానికి ఏముంటుంది అంటూ మాట్లాడతారు. అనంతరం కళ్యాణ్ వెడ్డింగ్ కార్డు ఓపెన్ చేసి చూడగా అందులో పెళ్లి కొడుకు దుగ్గిరాల కళ్యాణ్ అని ఉండడం చూసి కళ్యాణ్ సంతోష పడతాడు నేను కవితలను మాత్రమే కాదు కవితలు వెనుక ఉన్న వ్యక్తిని కూడా ప్రేమిస్తాను అంటూ తన ప్రేమ విషయాన్ని చెప్పడంతో కళ్యాణ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు.

ఇక రాజ్ తన తాతయ్యకు ఫోన్ చేసి మందులు వేసుకున్నావా అని అడుగుతారు. కావ్యకు ఫోన్ చేసావా అని అనడంతో లేదు తాతయ్య అని చెప్పగా మరి తనకు ఫోన్ చేయకుండా నాకు ఫోన్ చేస్తున్నావ్ ఏంటి రాజ్ అని మాట్లాడటంతో నేను వచ్చేటప్పుడు తీసుకునే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక రాజ్ రావడంతో కావ్య కూడా ఇంటికి బయలుదేరుతుంది. ఇక రాత్రికి కృష్ణమూర్తి విగ్రహాల వద్ద కాపలా కోసం వెళ్లి అక్కడే పడుకుంటానని చెబుతాడు.

అయితే రాహుల్ ఆరెంజ్ చేసినటువంటి దుండగలు అక్కడికి వచ్చి కృష్ణమూర్తి పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోతారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి బొమ్మలన్నింటిని కూడా తరలిస్తారు. ఇక మరుసటి రోజు ఉదయం కావ్య ,రాజ్ ,కనకం అక్కడికి రావడంతో ఆయన రక్తపు మడుగులో ఉండడం చూసి షాక్ అవుతారు. అలాగే బొమ్మలన్నింటిని కూడా దొంగలించిన విషయాన్ని కృష్ణమూర్తి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus