Anand Devarakonda: కచ్చితంగా అన్నయ్యతో సినిమా చేస్తా: ఆనంద్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దేవరకొండ బ్రదర్స్ ఒకరు. ఇక తాజాగా ఈ ఇద్దరు హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకోగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఈ ఏడాది దేవరకొండ బ్రదర్స్ కు చాలా బాగా కలిసి వచ్చిందని అందుకే వీరిద్దరూ నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పాలి. ఇకపోతే బేబీ సినిమా తర్వాత ఆనంద దేవరకొండ తన తదుపరి చిత్రం ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈయన ఉదయ్ శెట్టి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో గం..గం..గణేశా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఆనంద దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ సినిమా కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎదగానో ఆకట్టుకుంటుందని తెలియజేశారు. అయితే ప్రేక్షకులు ఎవరు కూడా ఈ సినిమాని బేబీ సినిమాతో కంపేర్ చేయవద్దని తెలిపారు. ఏ సినిమాకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత ఆ సినిమాలకు ఉంటాయని తెలియజేశారు.

ఇలా ఈ సినిమా గురించి (Anand Devarakonda) ఆనంద్ దేవరకొండ మాట్లాడిన అనంతరం అభిమానులు తన అన్నయ్యతో కలిసి మల్టీ స్టార్ సినిమా ఎప్పుడు చేయబోతున్నారు అంటూ ప్రశ్నించారు అయితే ఈ ప్రశ్నకు ఆనంద్ దేవరకొండ సమాధానం చెబుతూ తనకు అన్నయ్యతో కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉంది అయితే సరైన కథ దొరికితే తప్పకుండా అన్నయ్యతో కలిసి సినిమా చేస్తాను అంటూ ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus