Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » క‌థ‌లోని నిజాయితీ అంద‌రికీ న‌చ్చుతుంది: ఆనంద్ దేవ‌ర‌కొండ‌

క‌థ‌లోని నిజాయితీ అంద‌రికీ న‌చ్చుతుంది: ఆనంద్ దేవ‌ర‌కొండ‌

  • July 9, 2019 / 05:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క‌థ‌లోని నిజాయితీ అంద‌రికీ న‌చ్చుతుంది: ఆనంద్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్ టైన్మెంట్, బిగ్ బెన్ సిన‌మాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా దొర‌సాని. ఈమూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకొని యు/ఎ స‌ర్టిఫికేట్ ని పొందింది. కె.వి.ఆర్ మ‌హేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న దొర‌సాని చిత్రం ఈ నెల 12న రిలీజ్ కి సిద్ద‌మ‌వుతున్న‌సంద‌ర్భంగా హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ మీడియాతో ముచ్చ‌టించారు.

దొర‌సాని గురించిః

anand-devarakonda-about-dorasaani-movie8

ఇది ఒక పిరియాడిక్ ల‌వ్ స్టోరీ, రాజు, దొర‌సాని మ‌ద్య జ‌రిగిన ప్రేమ‌క‌థ‌. నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ప్రేమ‌క‌థ‌. క‌థ‌లోని స్వ‌చ్ఛ‌త‌, నిజాయితీ ఈ ప్రేమ‌క‌థ‌ను ముందుకు న‌డిపిస్తాయి. అన్నీ రియ‌ల్ లోకేష‌న్స్ లో షూటింగ్ చేసాము. ఆ క‌థ‌లోని ఆత్మ‌ను తెర‌మీద‌కు తెచ్చే ప్ర‌య‌త్నం చేసాం. ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర ఎక్క‌డా ఫేక్ ఎమోష‌న్స్ ని రానీయ‌లేదు. క‌థ‌ను ద‌ర్శ‌కుడు ట్రీట్ చేసిన విధానం చాలా రియ‌లిస్టిక్ గా ఉంటుంది.

ఆ ఆఫ‌ర్స్ ని సీరియ‌స్ గా తీసుకోలేదు!

anand-devarakonda-about-dorasaani-movie8

అన్న‌య్య (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) అర్జున్ రెడ్డి త‌ర్వాత కొన్ని ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. కానీ అప్పుడు సీరియ‌స్ గా తీసుకొలేదు. ఇండియా కి అన్న‌య్య బిజినెస్ ని స‌పోర్ట్ చేద్దామ‌ని వ‌చ్చాయి . యుస్ కి వెళ్ళ‌కు ముందు థియేట‌ర్స్ చేసాను. యాక్టింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఉందికానీ సినిమా ఎక్స్ పీరియ‌న్స్ లేదు. ఆ టైం లో ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర ను క‌లిశాక సినిమా మీద ఉన్న భ‌యాలు పోయాయి. ఆయ‌న 5 గంట‌లు క‌థ చెప్పాడు. ఆ క‌థ‌ను చెప్పిన తీరులోనే నాకు అర్దం అయ్యింది. ప్ర‌తి పాత్ర రియ‌ల్ గా ఉంటుంది. క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, సిద్ధిపేట లో రియ‌ల్ , కోదాడ ద‌గ్గ‌ర‌లోని గ‌డిలో ఎక్కువ రోజులు షూట్ చేసాము.

అన్న (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) టెన్ష‌న్ ప‌డ్డాడుః

anand-devarakonda-about-dorasaani-movie8

సినిమా చూసే ముందు అన్న టెన్ష‌న్ ప‌డ్డాడు. కానీ సినిమా చూసిన త‌ర్వాత చాలా ఆనంద ప‌డ్డాడు. సినిమా చూసిన త‌ర్వాత నాకు అన్న ఇచ్చిన ఎన‌ర్జీ కాన్ఫిడెన్స్ ని పెంచింది.

ఆడిష‌న్స్ ద్వారా సెలెక్ట్ అయ్యాముః

anand-devarakonda-about-dorasaani-movie7

విజ‌య్ దేవ‌రకొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌రకొండ ఒక‌డు ఉన్నాడు అని సినిమా స‌ర్కిల్ లో తెలుసు. ఈక‌థ కోసం ఆర్టిస్ట్ ల‌ను వెతుకుతున్న‌ప్పుడు న‌న్ను ట్రై చేద్దాం అనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిష‌న్స్ చేసాము. ఆ క్యారెక్ట‌ర్స్ కి ఫిట్ అవుతాము అనే న‌మ్మ‌కం ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు వ‌చ్చాకే మేము ప్రాజెక్ట్ లోకి వ‌చ్చాము.

శివాత్మిక ను అందుకే క‌ల‌వ‌లేదుః

anand-devarakonda-about-dorasaani-movie6

ఈ కథ‌లో రాజు, దేవ‌కి పాత్ర‌ల మ‌ద్య ఎక్క‌వ చ‌నువు ఉండ‌దు. అందుకే మాకు వ‌ర్క్ షాప్ లు విడివిడిగా నిర్వ‌హించారు. షూటింగ్ లోకేష‌న్ లో కూడా పాత్ర‌ల మ‌ద్య గ్యాప్ ను మెయిన్ టైన్ చేసాము. మేము ప్రెండ్స్ అయితే ఆ ఫీల్ స్క్రీన్ మీద‌కు వ‌స్తుంద‌ని ఆ జాగ్ర‌ర్త తీసుకున్నాము. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాము.

అన్న నాకు ధైర్యం వ‌చ్చాడుః

anand-devarakonda-about-dorasaani-movie5

అన్న చాలా స్ట‌గుల్స్ చూసాడు. కానీ అన్న‌కు వ‌చ్చిన స‌క్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది. టాలెంట్ ఉంటే స‌క్సెస్ అవ్వొచ్చు అనే న‌మ్మ‌కం క‌లిగింది. కానీ నా ప్ర‌తిభే న‌న్ను నిల‌బెడుతుంద‌ని నాకు తెలుసు. ఒక బ్ర‌ద‌ర్ స‌పోర్ట్ నాకు ఎప్పుడూ త‌న ద‌గ్గ‌ర ఉంటుంది, కానీ స్టార్ గా కాదు. అన్న తో పోలిక‌ల‌న్నీ సినిమా త‌ర్వాత పోతాయి అని న‌మ్ముతున్నాను.

నా పాత్ర హీరోలాగా ఉండ‌దుః

anand-devarakonda-about-dorasaani-movie4

ఇందులో నాపాత్ర చాలా రియ‌లిస్టిక్ గా ఉంటుంది. రాజు చాలా స‌హాజంగా అనిపిస్తాడు. దొర‌సానిని ప్రేమించిన రాజు లాగా క‌న‌ప‌డ‌తాను. చేసిన పాత్ర‌లు రియ‌ల్ లైఫ్ పాత్ర‌ల‌ను ప్ర‌తిబింబిస్తే చాలు ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతార‌ని న‌మ్ముతార‌ని న‌మ్ముతాము.

అన్న మాట్లాడుతుంటే క‌న్నీళ్ళు వ‌చ్చాయిః

anand-devarakonda-about-dorasaani-movie3

ఇంట్లో అంద‌రం ప్రాక్టిక‌ల్ గా ఉంటాము. ఎమోష‌న‌ల్ టాక్స్ త‌క్కువ‌. కానీ అన్న నాగురించి మాట్లాడుతుంటే ఎమోష‌న‌ల్ అయ్యాను. ఎందుకంటే త‌మ్ముడ్ని చూసుకోవాల‌ని అన్న‌కు ఉంటుంది.కానీ నా క‌ష్టం నేను ప‌డాలి, నా క‌థ నేను వెతుక్కొవాలి అని అన్న అనుకున్నాడు. స్టేజ్ మీద అలా మాట్లాడుతుంటే నేను అన్న‌లాగే ఫీల్ అయ్యాను. అన్న‌ది ప‌దేళ్ళ ప్ర‌యాణం. అందులో చాలా చూసాడు. అన్న‌తో పాటు ఒక సారి ఆడిష‌న్స్ కి వెళ్ళాను. సెలెక్ట్ అవ‌లేదు ఆ రోజు అన్న ఎంత బాధ ప‌డ్డాడో నేను ద‌గ్గ‌ర‌నుండి చూసాను. నాన్న సీరియ‌ల్స్ డైరెక్ట్ చేసేవారు, ఇంట్లో రోజూ సినిమా గురించి డిస్క‌ష‌న్స్ ఉండేవి.

సినిమా ముందు వ‌చ్చే కామెంట్స్ ని ప‌ట్టించుకోనుః

anand-devarakonda-about-dorasaani-movie2

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కామెంట్స్ ని సీరియ‌స్ గా తీసుకోను. సినిమా రిలీజ్ అయ్యాక నా న‌ట‌న మీద వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను తీసుకుంటాను. సినిమా పై పూర్తి న‌మ్మ‌కం ఉంది.

ఇది స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థః

anand-devarakonda-about-dorasaani-movie10

ఇందులో మా ప్రేమ‌క‌థ స్వ‌చ్చంగా ఉంటుంది. యాక్ష‌న్, యాంగ‌ర్ అలాంటివి ఏమీ ఉండ‌వు. లిప్ లాక్ లు అంత ఇపార్టెంట్ కావు. మా ప్రేమ‌క‌థ‌లో చాలా ట‌ర్న్స్ ఉంటాయి. మాప్రేమ‌ను మీరు ఫీల్ అవుతారు. ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర గ్రేట్ స్టోరీ టెల్ల‌ర్. మా క‌థ‌లోని అన్ని క్యారెక్ట‌ర్ మీద అత‌నికి పూర్తి క్లారిటీ ఉంది. అత‌ని మంచి ద‌ర్శ‌కుడిగా నిల‌బ‌డ‌తాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AnandDeverakonda
  • #DorasaaniMovie
  • #Rajasekhar
  • #ShivatmikaRajasekhar
  • #Vijaydeverakonda

Also Read

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

trending news

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

3 mins ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

49 mins ago
Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

4 hours ago
Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

4 hours ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

5 hours ago

latest news

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

1 hour ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

2 hours ago
Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

20 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

20 hours ago
Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version