వృత్తి, వ్యాపారం .. రంగమేదైనా అందులో కులం, మతం ప్రస్తావన ఉండడం మనదేశంలో కామన్. అయితే అది తెలుగు చిత్ర పరిశ్రమలో కొంచెం ఎక్కువ స్థాయిలో ఉందని ఇదివరకు అనేకమంది మాటల ద్వారా తెలిసింది. తాజాగా గేయ రచయిత అనంత శ్రీరామ్ కూడా ఈ విషయాన్ని బయటపెట్టారు. తమ కులానికి చెందిన హీరోకి పాటలు రాయకపోతే ఆ హీరో అభిమానులు తనని పనికిరాని వాడినంటూ అవమానించారని గేయ రచయిత చెప్పారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేను జూనియర్ ఎన్టీఆర్ కి పాటలు రాయనంతవరకు ఒక సామజిక వర్గానికి చెందిన వారు పాపులర్ రైటర్ కాదని విమర్శించారు. కొంతమంది అయితే తిట్టారు” అని చెప్పారు.
ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తనని ఇన్సల్ట్ చేశారని వెల్లడించారు. “700 పాటలు రాసాక గాని నాకు పవన్ కళ్యాణ్ సినిమాకు పాటలు రాసే అవకాశం రాలేదు. అప్పటివరకు నన్ను ఆయన అభిమానులు మా హీరోకి పాటలు రాయలేదు కాబట్టి గొప్ప రచయిత కాదని విమర్శించారు.” అని అనంత శ్రీరామ్ తెలిపారు. తమ హీరోకి పాటలు రాయనంత మాత్రాన మంచి రచయిత కాదని విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.