మిస్ ఇండియాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మానస వారణాసి ఇప్పుడు వెండితెరపై కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. సంతోష్ శోభన్ & మానస జోడిగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’, సమయం దగ్గర పడుతుండటంతో, మానస ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తోలి ప్రేమ, వాటి అనుభవాలు, బ్రేక్ అప్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.
తన కాలేజీ రోజుల్లో ఎదురైన తొలి ప్రేమ అనుభవాన్ని గుర్తుచేసుకున్న మానస, ఆ వయసులో ఉండే అమాయకత్వమే ఆ బంధాన్ని ప్రత్యేకంగా మార్చిందని చెప్పింది. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయాణం అని చెప్తూ, అలాగే బ్రేక్ అప్‌ను విషాదంగా కాకుండా, జీవితానికి దశ చూపించే ఒక పాఠంగా చూడాలని ఆమె సూచించారు. ఆ సమయంలో మనకు మన విలువలు, ఆశలు స్పష్టంగా తెలుస్తాయని చెప్పారు.
నేటి తరం ప్రేమలో కనిపిస్తున్న కొత్త ట్రెండ్స్‌పైనా ఆమె స్పందించారు. సంబంధం ఏ పేరుతో ఉన్నా, అందులో గౌరవం, భద్రత, సంతోషం ఉన్నాయా లేదా అన్నదే ముఖ్యమని మానస చెప్పుకొచ్చారు. ఇక ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా విషయానికి వస్తే, ఆధునిక ప్రేమకథలు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్, యువత ఎదుర్కొనే భావోద్వేగాల్ని రియలిస్టిక్‌గా చూపించబోతున్నట్టు సమాచారం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూలో మానస మాటలు చూస్తే, ఆమె కేవలం అందాల భామ మాత్రమే కాదు.. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తి అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.