పవన్ కళ్యాణ్ విమర్శకులకు తన కలంతో సమాధానం ఇచ్చిన అనంత శ్రీరామ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నిన్న అంతర్జాతీయ పురస్కారం వరించింది. సామాజిక సేవ చేసినందుకు ఇండో యూరోపియన్ ఫోరమ్(ఐఈబీఎఫ్) గ్లోబల్ బిజినెస్ మీట్ కి రావాలని జనసేన నేతకు ఆహ్వానం అందింది. నవంబర్ 17 న లండన్ లోని హౌస్ ఆఫ్ లాడ్స్ లో జరిగే ఇన్వెస్ట్ న్యూ ఇండియా సభలో పవన్ కి ఐఈబీఎఫ్ అవార్డు ప్రదానం చేయనున్నారు.  తమ అభిమాన హీరోకు అవార్డు రావడంతో పవన్ అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు.

సోషల్ మీడియా వేదికపై హంగామా చేశారు. ఇలా అభినందనలు తెలిపిన వారిలో యువ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఉన్నారు. “విమర్శించిన వారికి అభిమానుల ఛీత్కారం విమర్శించబడినవారికి అంతర్జాతీయ పురస్కారం ఇదేనేమో కత్తి లాంటి కర్మ సాక్షాత్కారం” అంటూ తనదైన  శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ఇది పవన్ ని రీసెంట్ గా విమర్శించిన ఓ వ్యక్తికి పంచ్ లా ఉందని పవన్ అభిమానులు భావిస్తున్నారు. అనంత శ్రీరామ్ పోస్ట్ కి లైకులు కొడుతున్నారు. పవన్ విమర్శించేవాళ్ళకి ఈ అవార్డు చెప్పుదెబ్బగా ఫ్యాన్స్ అభివర్ణిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus