Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..
- September 17, 2026 / 01:04 PM ISTByFilmy Focus Desk
కథ మీద ఓ దర్శకుడు, నిర్మాత నమ్మకం పెట్టుకుంటే.. ఆ కథ కోసం ఎంతగా కష్టపడతారు అనేది తెలియాలి అనుకుంటే.. ‘ఎల్లమ్మ’ సినిమాకు జరుగుతున్న చర్చల గురించి తెలుసుకుంటే సరి. ‘బలగం’ సినిమాతో టాలీవుడ్‌లో కథలకు బలం ఎంతుంది అనేది చూపించిన వేణు యల్దండి ఆ తర్వాత సినిమాగా ‘ఎల్లమ్మ’ అనే కథను రాసుకున్నారు. ఆ కథను సినిమాగా మలచాలని చాలా ఏళ్లుగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో రెండో అడ్డంకిని కూడా దాటేశారాయన.
Ananthika Sanilkumar
అవును, ‘ఎల్లమ్మ’ సినిమా విషయంలో గతకొన్ని రోజులుగా జరుగుతున్న హీరోయిన్ ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందట. గ్లామర్‌కి ప్రాధాన్యం ఇవ్వకుండా.. నటనకు మాత్రమే ప్రాధాన్యంగా ఇస్తూ జరిగిన హీరోయిన్ వేటలో చాలామంది స్టార్ హీరోయిన్లు, కొత్త హీరోయిన్ల పేర్లు చర్చకు వచ్చాయి. ఫైనల్‌గా అనంతిక సనీల్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు అంటూ.. మృణాల్ ఠాకూర్, శ్రీలీల, కీర్తి సురేష్, సాయిపల్లవి ఇలా చాలా పేర్లను చర్చలోకి తీసుకొచ్చిన విషయం తెలసిఇందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది అని సమాచారం. అందుకే అనంతిక అయితే సరిపోతుంది అని టీమ్ అనుకున్నారట. అయితే డీఎస్పీ హీరో కావడంతో కొంతమంది హీరోయిన్లు నో చెప్పారనే మాటలూ వినిపించాయి.
అన్నట్లు.. హీరో పాత్ర విషయంలోనూ చాలా మార్పులు జరిగాకే దేవి శ్రీ ప్రసాద్ వచ్చాడు. ఈ కథను వేణు యల్దండి – దిల్ రాజు చాలా మంది హీరోల దగ్గరకు తీసుకెళ్లారు. అలా వీరు కలిసి, కొన్నాళ్లు ట్రావెల్ చేసిన హీరోల్లో నాని, నితిన్, శర్వానంద్ లాంటి వారు కూడా ఉన్నారు. ఫైనల్లీ దేవి వచ్చాడు. పనిలో పనిగా ఎప్పుడో హీరోను చేస్తా అంటూ దేవికి దిల్ రాజు ఇచ్చిన మాట కూడా ఇప్పుడు పూర్తవుతోంది.











