విజయ్ దేవరకొండ పై అనన్య పాండే కామెంట్స్ వైరల్…!

  • April 6, 2020 / 08:13 PM IST

విజయ్ దేవరకొండ నటించిన గత రెండు చిత్రాలు డిజాస్టర్ లు అయ్యాయి. ‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్ ‘ చిత్రాలు విజయ్ దేవరకొండ మార్కెట్ ను బాగా దెబ్బ తీశాయి. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మన రౌడీ. ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు ప్రచారం జరిగింది… ఆ తరువాత ‘ఫైటర్’ కాదు ‘లైగర్’ అని కూడా వార్తలు వచ్చాయి కానీ ఏదీ ఫైనలైజ్ చెయ్యలేదు.

ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారు. అందుకోసమే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ను తీసుకున్నారు. పూరీ, ఛార్మీ లతో పాటు కరణ్ జోహార్ కూడా నిర్మాణ భాగస్వామిగా జాయిన్ అయ్యాడు. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న అనన్య పాండే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని విజయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..”విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయినప్పటికీ…

సెట్లో తన స్టార్ డమ్ ను అస్సలు చూపించడు. ఎంతో సాదాసీదాగా ఉంటాడు. తను నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఈ సినిమాతో నేను సౌత్ కి పరిచయమవుతున్నందుకు ఎంత ఆసక్తితో ఉన్నానో, విజయ్ దేవరకొండను బాలీవుడ్లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే విషయంలోను అంతే ఆత్రుతతోనూ అలాగే టెన్షన్ తోనూ వున్నాను. మా ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా మరింత హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను” అంటూ అనన్య పాండే చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus