నాది ప్రత్యేకపాత్రే కానీ ఆ టైప్ రోల్ కాదు!

బుల్లితెర యాంకర్ గానే కాక వెండితెరపై కూడా ప్రత్యేక పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకొన్న అనసూయ ప్రస్తుతం “రంగస్థలం 1985″లో కీలకపాత్ర పోషిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్-సమంత జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మొన్నటివరకూ బానే ఉంది కానీ.. రీసెంట్ గా “రంగస్థలం”లో డీజే బ్యూటీ పూజా హెగ్డే ఎంట్రీతో.. అనసూయ ఔట్ అనే వార్తలు హల్ చల్ చేశాయి. ఆ వార్తలు నిజం కాదని ప్రూవ్ చేస్తూ.. “రంగస్థలం”లో నేనున్నాను అంటూ ఓ ప్రముఖ డైలీ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

అయితే.. అందరూ ఊహిస్తున్నట్లు ఈ చిత్రంలో అనసూయది ఏదో రోమాంటిక్ రోల్ కాదట. చాలా వైవిధ్యమైన పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర సినిమాకి కీలకం కావడంతోపాటు కథలో ముఖ్యమైన మలుపు తిప్పుటుందట. అలాగే.. రామ్ చరణ్ తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడని, ఫుడ్ విషయంలో ఇద్దరికీ భలే సింక్ అయ్యిందని త్వరలోనే ఒక స్పెషల్ ఫుడ్ ను చరణ్ కోసం తానే స్వయంగా వండి నెక్స్ట్ షెడ్యూల్ లో తినిపిస్తానని చెబుతోంది అనసూయ.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus