Anasuya: తన భర్త రాముడు అంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ..!

  • June 13, 2022 / 05:19 AM IST

జబర్దస్త్ యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరంలేదు. అందుకే ఆమె గురించి ఎక్కువగా వార్తలు వస్తుంటాయి. బుల్లితెర పై గ్లామర్ తో సందడి చేస్తూ వస్తున్న అనసూయ.. వెండితెర పై మాత్రం పద్ధతిగా కనిపిస్తూ…. తన నటనతో ఆకట్టుకుంటూ ఉంటుంది.సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టిివ్ గా ఉంటూ వస్తోంది. ఇక్కడ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది.

ఈ మధ్య కాలంలో అనసూయ తన భర్తతో హాలిడే ట్రిప్ లు వేస్తూ అక్కడ దిగిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల భర్తకి ఘాటు లిప్ లాక్ ఇచ్చి అనసూయ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్లో అనసూయ పై ఓ స్కిట్ చేశారు. అనసూయ ఇంటి పై హోమ్ టూర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ స్కిట్ కాన్సెప్ట్.అనసూయ గెటప్ లో రైజింగ్ రాజు , అనసూయ భర్త గెటప్ లో దొరబాబు స్కిట్ లో ఓ రేంజ్లో పెర్ఫార్మ్ చేశారు.

దీంతో అనసూయ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలీక ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఓ సందర్భంలో రాముడు లాంటి నా భర్తకి దొరబాబు ని పెట్టారేంటి? ఇది ఆపక పోతే వైలెంట్ అవ్వుద్ది అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఎపిసోడ్ కు అనసూయ డ్రెస్సింగ్ కూడా హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus