టాలీవుడ్ యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి యాంకర్ అనసూయ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. నటిగా వరుస సినిమా అవకాశాలను అందుకొని స్టార్ సెలబ్రెటీగా కొనసాగుతున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే.
ఈ విధంగా తరచూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు క్షణాలలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు అనసూయ చేసే పోస్టుల కారణంగా పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు తద్వార నెటిజన్స్ భారీ స్థాయిలో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అనసూయ పోస్టులపై నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోతూ తనని ట్రోల్ చేయగా ఈమె కూడా తన స్టైల్ లోనే వారికి సమాధానాలు చెబుతూ ఉంటారు.
ఇకపోతే తాజాగా మరోసారి అనసూయ నేటిజెన్లను ఉద్దేశిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… సోషల్ మీడియాలో నన్ను ద్వేషించే వారందరికీ ఒక సందేశం అంటూ.. నేను చేసే పని మీకు నచ్చకపోవచ్చు కానీ నేను చేసేవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. కనుక మీరు ఇప్పటికీ నాకు అభిమానులే అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ఇలా నన్ను ద్వేషిస్తూనే నేను చేసే పోస్టులు చూస్తున్నారు కనుక మీరు నా అభిమానులే అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఈ పోస్ట్ పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు మేడమ్ ఇలాంటి పోస్టుల ద్వారా మరోసారి నెటిజన్లను రెచ్చగొడుతున్నారంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు మీకు హేటర్స్ ఎవరూ లేరు కానీ మీరు చేసే కొన్ని పోస్టులు చేసే కొన్ని పనుల వల్ల కొంతమంది మీకు శత్రువులుగా మారి మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అంటూ ఈ పోస్టు పై కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.