రంగస్థలం సినిమా తో రంగమ్మత్తగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న యాంకర్ అనసూయ అప్పటినుంచి సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది. ఆమెలోని సరికొత్త నటనను దర్శకులు వెండితెరపై సరి కొత్తగా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేవలం గ్లామర్ తోనే కాకుండా అనసూయ నటనతో కూడా అద్భుతంగా ఆకట్టుకోగలదని మరొకసారి గుర్తు చేసింది అని చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఇటీవల చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే పుష్ప మొదటి భాగంలో అనసూయ పాత్ర అంతగా
ఏమీ కొత్తగా అనిపించలేదు అని కూడా మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఆమె పాత్ర ఇంకా అయిపోలేదు అని రెండవ భాగంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది అని అంతేకాకుండా కథలో చాలా కీలకం కూడా అని దర్శకుడు సుకుమార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. సునీల్ భార్య అనసూయ కొన్ని సీన్లలో అయితే బాగానే నటించింది అని ఓ వర్గం ప్రేక్షకులు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.
ఇక సినిమాలో నటించేందుకు అనసూయ పారితోషకం ఏ స్థాయిలో తీసుకుంది అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే అనసూయ ఒకరోజు లెక్కన 1.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పుష్క సినిమా కోసం ఆమె వారానికి పైగానే కాల్షీట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే దాదాపు అనసూయ 12 లక్షల వరకు అందుకున్నట్లు సమాచారం. ఇక పుష్ప సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
లాభల్లోకి రావాలి అంటే ఇంకా భారీ స్థాయిలో షేర్స్ అందుకోవాల్సి ఉంది. ఇక రెండవ భాగం షూటింగ్ కూడా కొంత పూర్తిచేయాల్సి ఉంది. వచ్చే ఏడాది సమ్మర్లో పుష్పం రెండవ భాగం ది రుల్ విడుదల కానుంది. ఇక ప్రస్తుతం సుకుమార్ యూనిట్ పుష్ప సినిమా మరింత కలెక్షన్స్ అందుకునేలా ప్రమోషన్ చేస్తున్నారు. మరి మొత్తంగా సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!