Anasuya, Sudheer: సుధీర్ క్రేజ్ చూసి షాక్ అయిన అనసూయ?

సుడిగాలి సుదీర్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ ప్రస్తుతం వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన కే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరికెక్కిన వాంటెడ్ పండుగాడ్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఇక తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా సుధీర్ కు బయట ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన క్రేజ్ ఎలా ఉందో తెలిసిపోయింది.ఈ వేడుకలో భాగంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడిన అనంతరం సుధీర్ కి మైక్ ఇవ్వగా ఏకంగా అభిమానులు ఒక్కసారిగా కేకలతో పెద్ద ఎత్తున గోల చేశారు. ఒక స్టార్ హీరో మాట్లాడితే ఎలా కేకలు వేస్తారో అదే స్థాయిలో సుధీర్ మాట్లాడుతూ ఉండగా అభిమానులు కేకలు పెట్టడంతో ఆ ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.

ఇలా సుదీర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అక్కడే ఉన్నటువంటి అనసూయ ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది.ఇక వేదికపై సుదీర్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి రాఘవేంద్రరావు గారు సినిమాలు చూస్తూ పెరిగానని, అయితే ఇప్పుడు ఆయన సినిమాలోనే నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇక తాను నటించిన వాంటెడ్ పండుగాడ్ సినిమాని ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి ఆనందించాలని అలాగే ప్రతి ఒక్క సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరించి అభిమానించాలని ఈ సందర్భంగా సుధీర్ కోరారు.

ఇక ఈ సినిమాలో అనసూయ, దీపిక పిల్లి, విష్ణు ప్రియ వంటి తదితరులు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. కమెడియన్ గా అందరిని సందడి చేసిన సుధీర్ ఈ సినిమాతో హీరోగా ఎలా మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus