‘బాహుబలి’ ‘కుమారి 21ఎఫ్’ ‘కాటమరాయుడు’ వంటి చిత్రాల్లో నటించి అందరినీ ఆకర్షించింది బిగ్ బాస్ భానుశ్రీ. కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన భానుశ్రీ.. ప్రారంభంలో ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘డార్లింగ్’ కు పనిచేసింది. అవన్నీ ‘బిగ్ బాస్2’ రియాలిటీ షోలో పాల్గొనడానికి పనికొచ్చాయి. అయితే అప్పటి వరకూ భాను శ్రీ కి కాస్త మంచి పేరు ఉంది.. ‘బిగ్ బాస్2’ మొదటి వారం ఆమె తీరు చూస్తే కచ్చితంగా.. ‘బిగ్ బాస్2’ టాప్ 5 లో ఉంటుంది అని అంతా భావించారు.
కానీ తేజస్వి మాటలు గుడ్డిగా నమ్మేసి విన్నర్ కౌశల్ ను టార్గెట్ చెయ్యడం వల్ల ఈమె పై నెగిటివిటీ ఏర్పడింది. తరువాత ఆమె ఎలిమినేట్ అయ్యాక లైవ్ లోకి వచ్చి క్షమాపణలు చెప్పుకుంది లెండి. ఇదిలా ఉంటే.. ఆమె లవ్ స్టోరీని తాజాగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది భాను శ్రీ. ‘ఇండస్ట్రీకి వచ్చిన.. కొత్తలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. కనీసం ఉండడానికి చోటు కూడా లేకుండా అనేక కష్టాలు పడ్డాను. ఆ టైములో నా ఫ్రెండ్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.
ఆ కష్ట సమయంలో అతను నన్ను ఆదుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా క్రుంగి పోకుండా .. ధైర్యంగా ముందుకు సాగాలి అని చెప్పాడు. అప్పుడే అతనికి ప్రపోజ్ చేశా. అతన్నే పెళ్ళి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. కష్టకాలంలో ఆదుకున్న అతను కచ్చితంగా జీవితాంతం అండగా ఉంటాడు.. నన్ను ప్రేమగా చూసుకుంటాడు అని భరోసా కలిగింది’ అంటూ భానుశ్రీ చెప్పుకొచ్చింది. అయితే ఈసారి అతని పేరు మాత్రం చెప్పలేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మాత్రం అతని బాయ్ ఫ్రెండ్ పేరు శివ శంకర్ రెడ్డి అని చెప్పింది. బహుశా అతనేనేమో.
Most Recommended Video
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు