Jhansi: గోల్డ్ అండ్ బోల్డ్ అంటూ కూతురి ఫోటోని షేర్ చేసిన ఝాన్సీ!

బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సీనియర్ యాంకర్ ఝాన్సీ ఒకరు ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈమె యాంకర్ గా కొనసాగుతూ బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడమే కాకుండా మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ఇటు బుల్లితెరపై అటువంటి వెండి తెరపై ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నటువంటి యాంకర్ ఝాన్సీ వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈమె జోగినాయుడిని పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ దంపతులకు కుమార్తె కూడా జన్మించారు. ఇలా కుమార్తె జన్మించిన తర్వాత ఝాన్సీ జోగి నాయుడు మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా వీరిద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విధంగా ఝాన్సీ తన భర్త నుంచి వేరు కావడంతో తన కూతురిని కూడా తన వద్ద ఉంచుకున్నారు.

ఇక తమ కూతురికి ధన్య అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ధన్య ఫోటోలను తరచూ ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు కానీ ఎప్పుడూ కూడా ఎలాంటి కార్యక్రమాలలోనూ ఈమెను ప్రేక్షకులకు పరిచయం చేయలేదు. కూతురి ఆలన పాలన తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఝాన్సీ తన కూతురి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినటువంటి ఎంతోమంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఝాన్సీ కూతురేంటి ఇంత అందంగా ఉంది.

అచ్చం తల్లి పోలికలతో చాలా అందంగా ఉన్నారు అంటూ తన కుమార్తె ఫోటోలపై కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఝాన్సీ కనుక తన కూతురిని ఇండస్ట్రీలోకి పంపిస్తే ఖచ్చితంగా హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటారు అంటూ తన కుమార్తె అందంపై పొగడ్తలు కురిపిస్తున్నారు. మరికొంతమంది ఈ ఫోటోలపై స్పందిస్తూ మీ కూతురి అందం ముందు హీరోయిన్లు కూడా తేలిపోతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.అయితే తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా గోల్డ్ అండ్ బోల్డ్ అంటూ తన (Jhansi) కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈమె ఈ ఫోటోని షేర్ చేసారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus