‘హనీ ఆన్ ద వే’ అంటున్న యాంకర్ లాస్య ..!
- February 16, 2019 / 05:59 PM ISTByFilmy Focus
గతంలో ‘మా టీవీ’ లో ప్రసారమయ్యే ‘సంథింగ్ స్పెషల్’ ప్రోగ్రాంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది యాంకర్ లాస్య. అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి హాట్ యాంకర్ల పోటీని తట్టుకంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది లాస్య. 2017 ఫిబ్రవరి 17న మంజునాథ్ ను వివాహం చేసుకుంది లాస్య. ఏడేళ్ళ వీరి ప్రేమ ప్రయాణాన్ని పెళ్ళి బంధంతో బలపరుచుకున్నారు. పెళ్ళి తరువాత యాంకరింగ్‌కి దూరమైన లాస్య ఇటీవల ‘రాజా మీరు కేక’ చిత్రంలో మాత్రమే నటించింది.

- దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
- ‘మజిలీ’ టీజర్ రివ్యూ

ఇటీవల రెండో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న లాస్య తల్లి కాబోతుందట. ఈ విషయాన్నీ స్వయంగా లాస్యనే తెలియజేసింది. లాస్య తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… “ఈ గుడ్ న్యూస్‌ని గుడ్ డే నాడు షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ‘లిటిల్ హనీ ఆన్ ది వే’ ” అంటూ తన భర్త మంజునాథ్‌లో కలిసి నిండు గర్భిణిగా ఉన్న తన ఫొటోని షేర్ చేసింది లాస్య. అమ్మ కడుపులో ఉన్న తన బిడ్డకి ఆప్యాయంగా ముద్దు పెడుతూ ఉన్న మంజునాథ్… లాస్యల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













