తనపై వస్తున్న రూమర్లపై స్పందించిన లాస్య
- May 3, 2017 / 07:21 AM ISTByFilmy Focus
అమాయకత్వం ఉట్టి పడే యాంకర్ గా పేరుతెచ్చుకున్న లాస్య.. తెలుగు ఛానల్స్ లో అనేక షోస్ చేసి అభిమానులను ఏర్పరుచుకుంది. ఎటువంటి స్కిన్ షో, డబల్ మీనింగ్ డైలాగులు చెప్పని ఈమెపై కూడా కొంతకాలం గాసిప్స్ బాగానే వచ్చాయి. కో యాంకర్ రవిని ప్రేమించినట్లు, అతను నో చెప్పగానే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు, ఆ తర్వాత యువహీరో రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికి లాస్య తన పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టింది. మరాఠి యువకుడు మంజునాథ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమె టీవీల్లో కనిపించలేదు. ఆమెపై రూమర్లు కనిపించలేదు.
అయితే తాజాగా లాస్య గర్భవతి అయినట్లు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం లాస్యకి మూడవ నెలని అందుకే ఏ షో చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు లాస్యని ఆశ్చర్యానికి గురిచేసింది. ‘‘ఓరి నాయనో.. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వాళ్లకి దండేసి దండం పెట్టాలి.. దేవుడా’’ అని ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడతాయో లేదో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













