‘బిగ్ బాస్4’ ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.కొత్త కొత్త టాస్కులు.. మధ్య మధ్యలో గెస్ట్ లతో .. హౌస్ కు కొత్త కళ వస్తుందనే చెప్పాలి. మొన్నటికి మొన్న సమంత ఓ ఎపిసోడ్ ను హోస్ట్ చేసి.. మంచి టి.ఆర్.పి రేటింగ్ ను రప్పించింది.ఈ దీపావళి కూడా మరింత సందడి ఉంటుందని భోగట్టా. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ‘బిగ్ బాస్4’ తాజా ఎపిసోడ్లో హౌస్మేట్స్ కు ఓ టాస్క్ ను ఇచ్చారు. ‘సొసైటీని దృష్టిలో పెట్టుకుని చేసిన త్యాగాలు ఏమైనా ఉంటే’ హౌస్మేట్స్ తో పంచుకోవాలని బిగ్బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో ఎవ్వరికీ తెలియని ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది లాస్య.
ఆమె మాట్లాడుతూ… ” 2010లోనే నాకు పెళ్లైన విషయం చాలా మందికి తెలీదు.హౌస్లోకి వచ్చే ముందే నేను రివీల్ చేశాను.అయితే 2010లో పెళ్లైనప్పటికీ నేను, నా భర్త, వేరు వేరుగా ఉండేవాళ్ళం. మా రెండు కుటుంబాలు మా పెళ్లికి అంగీకరించకపోవడంతో అలా దూరంగా ఉండేవాళ్ళం. అయితే రెండేళ్ల తరువాత అంటే.. 2012 నుండీ కలిసే ఉన్నాము. అటు తరువాత 2014 లో మా నాన్న దగ్గర నుండీ నాకు ఫోన్ వచ్చింది. ‘నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసింది. అయితే మన ఫ్యామిలీలో ఇంకా ఎవ్వరికీ తెలీదు. ఫస్ట్ మీరు సెటిల్ అయ్యి చూపించండి. అప్పుడు నేనే పెళ్లి చేస్తాను’ అని హామీ ఇచ్చారు. అప్పుడు కొంచెం రిలీఫ్ గా అనిపించింది. అయితే ఆ మరుసటి వారం నాకు హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల హాస్పిటల్ కు వెళ్ళాను.
అప్పుడు వైధ్యులు నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు. అయినా సరే ఈ విషయాన్ని నేను ఎవ్వరికీ చెప్పకుండా… కడుపు తీయించేసుకున్నాను. ఆ ఫైల్ ఇప్పటికీ నా దగ్గరే ఉంది. ‘నా చేతులతో నేనే నా బేబీని చంపేసుకున్నాను’ అని చాలా ఏడ్చాను. మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అవుతానా లేదా అని చాలా భయమేసింది. ఆ బాధతో నేను డిప్రెషన్లోకి కూడా వెళ్లిపోయాను. ఇక 2017లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాక.. ఐదు నెలలకి మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ అప్పుడు మిస్ క్యారీ అయ్యింది. దాంతో ఇంకా బాదేసింది. నేను తల్లిని అవుతానా? లేదా? అని చాలా భయపడేదాన్ని.అయితే 2018లో నా కడుపులో జిన్ను గాడు వచ్చాడు. నా జీవితంలో వెలుగులు నింపాడు. ‘అమ్మా నాన్న… అప్పుడు మొదటి బేబీని తీయించేసుకున్న విషయం మీకు ఇప్పటివరకూ చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నా. తప్పు ఉంటే క్షమించండి” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది లాస్య.