‘నా’ సినిమాకు పిల్లలతో వద్దు

రేష్మీ …టాలీవుడ్ లో అర..కోర సినిమాలతో పెద్దగా కలసిరాకపోవడంతో బుల్లి తెరపై వాలిపోయిన అందాల యాంకర్ రేష్మి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో తన అందచందాలతో కుర్రకారుని ఒక ఊపు  ఊపిన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లో ‘గుంటూర్ టాకీస్’ చిత్రం ద్వారా మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తుంది. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ భామ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిజంగా ఆమె నిజాయితీని మెచ్చుకోక తప్పదు అనిపిస్తుంది. విషయం ఏమిటంటే రేష్మి నటించిన ‘గుంటూర్ టాకీస్’ సినిమా త్వరలో విడుదల కానుండడంతో ప్రమోషన్ లో భాగంగా రేష్మి మాట్లాడుతూ..మా సినిమాకు పిల్లలను తీసుకుని వెళ్ళకండి. మాది ‘ఎ’ రేటెడ్ మూవీ అని.. కొంచెం బోల్డ్ సీన్స్ – బోల్డ్ సాంగ్స్ ఉంటాయని.. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్లకపోతేనే బెటర్ అని.. ఆమె నిజాయితీగా చెబుతుంది.
సహజంగా దర్శక నిర్మాతలు సినిమాలో ఎంత మసాలా ఉన్నా..మాది కుటుంబ కధ చిత్రం అని డప్పులు కొడుతూ ఉంటారు, కానీ రేష్మి మాత్రం భాద్యతగా చెబుతున్నా అంటూ..తమ సినిమా గురించి నిజాలు ఒప్పుకుంటూ ప్రమోట్ చేస్తూ ఉండడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే.
అంతేకాకుండా ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ విషయం గురించి సైతం రేష్మి వివరించింది. మామూలుగా పల్లెటూళ్లలో అమ్మాయిలు అబ్బాయిలకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఐతే తమకు ఏ అడ్డూ లేకుండా ఒక రోజంతా గడిపే పరిస్థితి వచ్చినపుడు, ఒక అబ్బాయి అమ్మాయి ఎలా ప్రవర్తిస్తారో అన్న సీన్స్ ను పాటల్లో చాలా బోల్డ్ గా చిత్రీకరించాం, అదేదో కల్పితంగా కాకుండా, కథలో భాగంగానే ఏదైనా చేశాం’’ అని చెప్పింది రష్మి. అంటే ఆమె చెప్పిన ప్రకారం ఈ సినిమాలో మసాలా భారీగానే ఉందన్నమాట. చూద్దాం మరి రేష్మి మరో విద్యా బాలన్ గా అవతారం ఎత్తుతుందేమో.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus