Rashmi Gautam: అభిమానులపై ఫైర్ అయిన యాంకర్ రష్మీ

యాంకర్ రష్మీ గుంటూరు టాకీస్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది..కానీ ఆ సినిమా రష్మీకి అనుకున్నంత గుర్తింపుని తీసుకురాలేకపోయింది. తరువాత హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో రష్మీకి అవకాశాలు రాలేదనే చెప్పుకోవాలి. అవకాశాలు వచ్చినప్పుడల్లా సినిమాలల్లో ప్రత్యేక పాత్రలో నటిస్తుంది యాంకర్ రష్మీ.. తెలుగు బుల్లితెర యాంకర్ గా తన అందంతో నటనతో యువతను ఆకర్షిస్తున్న యాంకర్ రష్మీ. తన నటనతోనే కాదు అందంతో కూడా ఆకట్టుకుంటున్న ఈమె వచ్చి రాని తెలుగుతో ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని చాటుకున్న రష్మీ ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలిసిందే. ఇక తండ్రి తమను దూరం పెట్టినా తల్లితో జీవితాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది. అంతేకాదు బుల్లితెర యాంకర్లలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న యాంకర్ గా కూడా చలామణి అవుతోంది. మరొకవైపు సమాజంలో జరిగే అన్యాయాలపై కూడా స్పందిస్తూ తనదైన శైలిలో అందరినీ అలరిస్తూ ఉండే ఈమె అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా తన పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి చాలా గ్రాండ్ గా జరుపుకుంది.ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా వాటిని చూసిన కొంతమంది పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పాజిటివ్ గా కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది రష్మీ గౌతమ్ ను ఎగతాళి చేసే విధంగా నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయంపై ఆమె స్పందిస్తూ నెగిటివ్ గా కామెంట్ పెట్టే వాళ్ళకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.

ఒక లాంగ్ నోట్ రిలీజ్ చేసింది (Rashmi Gautam) రష్మీ.. నాతో ఉండేవాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారు అలాగని నాపై నెగటివ్ కామెంట్స్ చేసే వారు పోయినా పట్టించుకోను.. వయసు మరో ఏడాది పెరిగింది. పుట్టినరోజులు ఇంత అద్భుతంగా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలిపింది రష్మి గౌతమ్ ఇకపోతే రష్మి చేసిన ఈ కామెంట్లో ఇప్పుడు అందరిని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus