అలా చేసినందుకు నన్ను క్షమించండి : రష్మీ

యాంకర్ రష్మీ … నెటిజన్లకు క్షమాపణలు కోరడం చర్చనీయాంశం అయ్యింది. గత రెండు రోజులుగా ఈమెను ట్రోల్ చేస్తున్న నెటిజెన్లకు ఫలితం దక్కినట్టయ్యింది. అసలు విషయం ఏమిటంటే… ఇటీవల రాజమండ్రి లో ఓ స్టోర్ ఓపెనింగ్ కోసం యాంకర్ రష్మీ వెళ్ళింది. దాంతో అక్కడ పెద్ద ఎత్తున జనాలు వచ్చేసారు. ఈ క్రమంలో వారిని కంట్రోల్ చేయడానికి.. పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. ముందుగా రష్మీ తన సోషల్ మీడియాలో రాజమండ్రి స్టోర్ ఓపెనింగ్ కు రాబోతున్నట్టు తెలుపడం వల్లనే ఇంతమంది జనం వచ్చారు. దాంతో రష్మీ పై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు మరికొందరు నెటిజన్లు. అసలే కరోనా వైరస్ భయంతో జనాలు భయపడుతున్నారు… జనసమూహం ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దు.. గుంపులుగా కూడొద్దు అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన తరుణంలో ఇలా స్టోర్ ఓపెనింగ్ లకు రావడమేంటి అంటూ రష్మీని ప్రశ్నిస్తూ తిట్టిపోశారు. దీని పై రష్మీ స్పందించి క్షమాపణలు కోరింది.

రష్మీ మాట్లాడుతూ.. “నా వ‌ల్ల ఇబ్బంది ప‌డిన ప్రతీ ఒక్కరికీ సారీ…! ఇలా పెద్ద ఎత్తున జనాలు వస్తారని అనుకోలేదు. కరోనా భయం వల్ల ఎవ్వరూ రారులే అనుకున్నాను. అందులోనూ ఈ స్టోర్ ఓపెనింగ్ కు వస్తానని ఎప్పుడో అగ్రిమెంట్ పై సైన్ చేశాను. దీంతో త‌ప్ప‌లేదు.అందులోనూ ప్ర‌భుత్వం నుండి కూడా వచ్చింది కాబట్టి పెద్దగా ఆలోచించలేదు. ఇక కరోనా గురించి కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాణాలు ముఖం… ప్రభుత్వాలు చెబుతున్న జాగ్రత్తలు అందరూ పాటించండి” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus