టాలీవుడ్ యాంకర్ రష్మీ (Rashmi Gautam ) అందరికీ సుపరిచితమే. మొదట్లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈమె.. వాటితో అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేకపోయింది. కానీ ‘జబర్దస్త్’ కామెడీ షో వల్ల ఆమె దశ తిరిగింది. ఈమె యాంకరింగ్, గ్లామర్ కి అక్కడ మంచి మార్కులు పడ్డాయి. మరోపక్క సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు, కమెడియన్ సుధీర్ తో (Sudigali Sudheer) ప్రేమాయణం వంటి వార్తలతో ఈమె మరింత పాపులర్ అయ్యింది. ఇవన్నీ ఒక వైపు అనుకుంటే..
సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్ల నెగిటివ్ కామెంట్లకి కూడా ఈమె రియాక్ట్ అయ్యే తీరు హాట్ టాపిక్ అవుతుంటుంది. అంతేకాదు సామాజిక అంశాల పై రష్మీ స్పందించే తీరు, మూగజీవాలకు ఆమె ఇచ్చే ప్రాముఖ్యత వంటివి కూడా అందరికీ నచ్చుతాయి. ఇదిలా ఉండగా.. రష్మీ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఒక ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అది ఆమె ఫాలోవర్స్ ని టెన్షన్ పెడుతుంది అనే చెప్పాలి.
రష్మీ తన ఇన్స్టా పోస్ట్ ద్వారా స్పందిస్తూ.. “నేను సర్జరీ కోసం రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంది. దాని వల్ల నాకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాను. దానికి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుంది.. మళ్ళీ నేను డాన్స్ చేయగలుగుతాను అని భావిస్తున్నాను” అంటూ పేర్కొంది. దీనికి హాస్పిటల్ బెడ్ పై తీసుకున్న ఫోటోని జత చేసింది. ప్రస్తుతం రష్మీ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తూ కామెంట్లు పెడుతున్నారు.