అల్లు అరవింద్ (Allu Aravind) ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ ని (Game Changer) ఉద్దేశించి ‘తండేల్’ (Thandel) ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ‘చిరుత’ (Chirutha) యావరేజ్ అంటూ కూడా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట జారారు. దీంతో మెగా అభిమానులు అల్లు అరవింద్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అసలే అల్లు అర్జున్ (Allu Arjun) వల్ల మండిపోయి ఉన్న మెగా అభిమానులని ఇవి మరింతగా రెచ్చగొట్టినట్టు అయ్యింది. ‘తండేల్’ సినిమా హెచ్.డి పైరసీ వెనుక కూడా ఇదే కారణమై ఉండవచ్చు అనేది కొందరి వాదన.
మొత్తానికి దీనిపై అల్లు అరవింద్ (Allu Aravind) స్పందించి చరణ్ (Ram Charan) అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈరోజు ‘తండేల్’ పైరసీని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అల్లు అరవింద్..తన పై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ఇటీవల దిల్ రాజుని (Dil Raju) అడ్డంపెట్టుకుని రాంచరణ్ ని తగ్గించాను అని భావించి చాలా మంది నన్ను ట్రోల్ చేశారు. దీనిపై నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే.. దిల్ రాజుని లైఫ్ గురించి చెప్పే క్రమంలో నేను అలా అనడం జరిగింది.
దీంతో మెగా అభిమానులు హర్ట్ అయ్యారు. ఆ తర్వాత నాకు కూడా అనిపించింది. అనవసరంగా అలా అనేశానే అని..! దయచేసి ఆ విషయంలో నన్ను క్షమించండి. నేను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదు. చరణ్ నాకున్న ఏకైక మేనల్లుడు. నేను కూడా అతనికున్న ఏకైక మేనమామ. మా మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఇంతకు మించి ఏం మాట్లాడినా.. దీనిపై ఇంకా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ‘చిరుత’ ప్లాప్ అంటూ చేసిన కామెంట్స్ పై స్పందించడానికి అల్లు అరవింద్ (Allu Aravind) ఇష్టపడలేదు.
దిల్ రాజుని అడ్డంపెట్టుకుని రాంచరణ్ ని తగ్గించాను అని నన్ను ట్రోల్ చేశారు..
చరణ్ నాకు ఉన్న ఏకైక మేనల్లుడు.. నా కొడుకు లాంటోడు..
చరణ్ కి నాకు మధ్య ఓ మంచి అనుబంధం ఉంది : అల్లు అరవింద్#AlluAravind #Dilraju #RamCharan #GameChanger #Thandel pic.twitter.com/lGjduuKKrv— Filmy Focus (@FilmyFocus) February 10, 2025