రష్మీ గౌతమ్ కు తప్పని సెటైర్లు…!

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్… ‘జబర్దస్త్’ లో చిన్న చిన్న డ్రెస్ లు వేసి కుర్రకారుని బాగా ఎట్రాక్ట్ చేసింది. అలా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. అయితే గ్లామర్ పాత్రలు తప్ప అనసూయలా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చెయ్యలేదు కాబట్టి పెద్దగా రాణించలేకపోయింది. దీంతో ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలనుకుంటుందో ఏమో…సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఓక కామెంట్ పెడుతుంది. దానికి ఎవరో ఒకరు కౌంటర్ వేస్తారు… పోనీ తను సెలబ్రిటీ కాబట్టి ఇలాంటి కామెంట్స్ రావడం ఖాయం అని వదిలేస్తుందా అంటే.. లేదు… వాళ్లకి ఏదో ఒక కౌంటర్ ఇస్తుంది. దాంతో వాళ్లు రెచ్చిపోతారు. ఇప్పుడు కూడా అదే జరిగింది.

రష్మీ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… “కరోనా కారణంగా చాలా మంది ఆకలితో చచ్చిపోతున్నారు.. రోజూవారీ కూలీలతో పాటు బిక్షగాళ్లు కూడా అన్నం కోసం అలమటిస్తున్నారు.. దయచేసి అలాంటి వాళ్ళకు… మీరు తోచిన సాయం చేయండి.. మీరు తినే అన్నంలో కాస్త వాళ్లకు కూడా పెట్టండి… అంతకంటే మరో మంచిపని ఇంకోటి లేదు” అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు రష్మీ ని చాలా మంది అభినందించారు. అయితే ఓ వ్యక్తి మాత్రం…”ముందు నువ్వు ఇలాంటి పోస్టులు పెట్టడం మానేసి.. నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్లకు పోయి సాయం చెయ్యి” అంటూ కామెంట్ పెట్టాడు.

ఇది చూసిన రష్మీ…”తమరు ముందు మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి.. కనీసం నువ్వు పెట్టుకున్న పేరుకు అయినా వ్యాల్యూ ఇవ్వు.. ఆ పేరు పరువు తీయొద్దు అంటూ మండిపడింది. పై కామెంట్ చేసిన వ్యక్తి పేరు కళ్యాణ్ పవర్ స్టార్.. ! మన పవన్ కళ్యాణ్ అభిమాని. దాంతో పవన్ పేరుకు చాలా విలువ ఉంది.. దాంతో ఇలాంటి చీప్ కామెంట్స్ పెట్టొద్దు… అని రష్మీ అర్ధం కావొచ్చు. అయితే మరికొందరు… పవన్ కళ్యాణ్ పేరుని తీసేసి రష్మీని ఏమైనా అనొచ్చు ..అంటూ కౌంటర్ లు వేశారు. ఇలా బుక్ అయిపొయింది రష్మీ.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus