Anchor Ravi Eliminated: బిగ్ బాస్ ట్విస్ట్ మాములుగా లేదు..!

  • November 27, 2021 / 08:55 PM IST

బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. ప్రతీవారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటివరకు 11 మంది ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో మానస్ తప్ప మిగిలిన ఏడుగురు కూడా నామినేషన్ లో ఉన్నారు. షణ్ముఖ్, రవి, సన్నీ, శ్రీరామ్ లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో వీరంతా ఈజీగా సేవ్ అయిపోతారని అంతా అనుకున్నారు.

ఈ మధ్య కాజల్ కి కూడా ఫ్యాన్ బేస్ పెరగడంతో ఆమెకి కూడా ఓట్లు బాగా పడుతున్నాయని టాక్. ఇక మిగిలిన ప్రియాంక, సిరిలలో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదని అంచనా వేశారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వారం అమ్మాయిల్లో నుంచి ఒకరు కాకుండా టాప్ 5లో ఉంటాడనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నాడు. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరో తెలుసా..? యాంకర్ రవి.

హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ లలో రవి ఒకడు. ఏ గేమ్ అయినా.. వెనుకాడకుండా ఆడతాడు. గ్రూప్ సపోర్ట్ తీసుకుంటూనే.. సోలోగా కూడా ఆడుకుంటాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు హౌస్ నుంచి బయటకు పంపించేస్తున్నారని సమాచారం. ఇది పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. అయితే ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో సోషల్ మీడియాలో రవి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఈ ఎలిమినేషన్ ఫెయిర్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంతనిజముందో రేపటి ఎపిసోడ్ లో తెలిసిపోతుంది!

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus