బిగ్ బాస్ కంటెస్టెంట్, యాంకర్ రవి షో నుంచి బయటకు వచ్చిన తరువాత తొలిసారి ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఇంటి విశేషాలను పంచుకోవడంతో పాటు తనపై వచ్చిన నెగెటివిటీపై కూడా స్పందించాడు. ‘నేనే వెళ్లేముందు చెప్పాను.. నన్ను ఆడుకోండి, ట్రోల్ చేయండి, మీ ఇష్టమని అన్నాను.. కానీ చాలామంది నా ఫ్యామిలీను, నిత్యను ఇన్వాల్వ్ చేశారు.. నా బిడ్డను కూడా వదల్లేదు’ అంటూ ఫైర్ అయ్యాడు.
బయటొక బ్యాచ్ ఉంటుందని.. వాళ్లకు డబ్బులిస్తే వాళ్ల ఫ్యామిలీ గురించి కూడా చెత్తగా మాట్లాడతారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రెండు వేల రూపాయలిస్తామంటే వాళ్ల తల్లిదండ్రుల గురించి కూడా చెడ్డగా రాసేవాళ్లు కొందరున్నారని అన్నాడు. ఇంత దారుణమా..? డబ్బు కోసం ఇంత నీచాతినీచంగా ఈ లెవల్ కి దిగజారుతున్నామా..? అంటూ ప్రశ్నించాడు. లోపల జరిగేది ఒకటి.. బయటకు వచ్చేది ఇంకొకటి అని.. బయట డబ్బు తీసుకొని గేమ్ ఆడుతున్నవారు లోపలి గేమ్ ను డామినేట్ చేస్తున్నారని అన్నాడు.
24 గంటల్లో ఒక గంట మాత్రమే చూపిస్తున్నారని.. బిగ్ బాస్ అనేది మైండ్ గేమ్ అని చెప్పాడు. ఎవరో చెప్పేది వినకుండా.. మీకు ఎవరు బాగా ఆడుతున్నారనిపిస్తే.. వాళ్లకు ఓటేయండి అంటూ చెప్పుకొచ్చాడు రవి.