యాంకర్ శ్యామల తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన ఈమె మొదట సీరియల్స్ లో నటించేది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా ఆశించిన బ్రేక్ రాలేదు. అయితే ఇదే టైంలో బుల్లితెర పై క్లిక్ అవ్వడంతో.. బిజీ యాంకర్ గా రాణిస్తుంది. సినిమాల ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసే ఇంటర్వ్యూలకు యాంకరింగ్ చేస్తూనే.. మరోపక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు వంటి వాటికి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
ఇక శ్యామల.. సీరియల్ యాక్టర్ నరసింహని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా బాలన్స్ చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల యాంకర్ శ్యామల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తన భర్త నరసింహ అలాగే తన స్నేహితులు, సన్నిహితుల మధ్య తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కొంచెం ఆలస్యంగా బయటకు వచ్చాయి. అయినప్పటికీ అవి వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా లుక్కేయండి :