బెంగళూరు రేవ్ పార్టీ కేసు పెద్ద దుమారమే రేపింది అని చెప్పాలి. ఇందులో టాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారు అని బెంగళూరు పోలీసులు చెప్పడం ఆ తర్వాత హేమ (Hema) , శ్రీకాంత్ (Srikanth), జానీ మాస్టర్ (Jani Master) వంటి వార్ల పేర్లు బయటకు రావడం జరిగింది. అటు తర్వాత హేమ ఓ వీడియో పోస్ట్ చేసి ఆ పార్టీతో తనకు సంబంధం లేదు అని చెప్పడం.. ఆ తర్వాత ఆమె రేవ్ పార్టీలో దొరికింది అని పోలీసులు కన్ఫర్మ్ చేసి ఫోటో రిలీజ్ చేయడంతో.. ఎవరి వీడియో నమ్మాలో అర్థం కానీ కన్ఫ్యూజన్లో ప్రేక్షకులు పడ్డారు అని చెప్పాలి.
ఇది పక్కన పెడితే.. ఈ పార్టీలో నటి యాంకర్ శ్యామల (Shyamala) కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీని పై ఆమె ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.. “బెంగళూరు రేవ్ పార్టీ అసలు ఎప్పుడు ఎక్కడ జరిగిందో? అక్కడ ఎవరెవరు ఉన్నారో? నాకు తెలీదు. కానీ అందులో ‘నేను కూడా ఉన్నాను’ అంటూ ఒక ఛానల్ నాపై దుష్ప్రచారం చేస్తుంది.
ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానం అయి ఉన్నాననే విషయం తెలిసి మా పార్టీ పై, నా పై బురదజల్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసే అసత్య ప్రచారం ఇది. వాళ్ల పై లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే పరువు నష్టం దావా కూడా వేశాను. జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని ఇలా అసత్య ప్రచారాలు చేసే వాళ్ళు కాదు. దయచేసి మీ అసత్య ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించవద్దు” అంటూ శ్యామల చెప్పుకొచ్చింది.
అయితే ‘ ‘పార్టీలో నేను లేను’ అంటే సరిపోతుంది కదా? ఈ టైంలో రాజకీయాల ప్రస్తావన ఎందుకు?’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొన్నామధ్య శ్యామలని జనసైనికులు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని వారిపై కూడా కౌంటర్లు వేయాలని శ్యామల ఇలా రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చినట్టు అంతా అనుకుంటున్నారు.
బెంగళూరు రేవ్ పార్టీ ఆరోపణలపై యాంకర్ శ్యామల ఫైర్! Anchor #Shyamala Reacts On Bangalore Rave Party pic.twitter.com/uB35hVG0Qt
— Filmy Focus (@FilmyFocus) May 22, 2024