Naga Chaitanya: తండేల్ స్టోరీ రివీల్ చేసిన నాగచైతన్య.. ఏం చెప్పారంటే?

నాగచైతన్య (Naga Chaitanya) సాయిపల్లవి (Sai Pallavi) కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అని ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాతో ప్రూవ్ అయింది. ఈ కాంబినేషన్ లో తండేల్ (Thandel) పేరుతో ఒక సినిమా తెరకెక్కుతుండగా నాగచైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. నాగచైతన్య చందూ మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్ లో ఇది మూడో సినిమా కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. తండేల్ సినిమా స్టోరీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే ఈ కథ రియల్ లైఫ్ లో జరిగిన రాజు అనే ఒక వ్యక్తి పాత్రకు సంబంధించిన కథ అని నాగచైతన్య వెల్లడించారు. రాజు అనే జాలరి జీవితంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. రాజు అనే జాలరి చేపల వేట కోసం వెళ్లి పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడ రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాడని చై పేర్కొన్నారు.

ఆ పాత్రను అర్థం చేసుకుని ఆ పాత్రలో లీనం కావడానికి దాదాపుగా 9 నెలల సమయం పట్టిందని నాగచైతన్య వెల్లడించారు. రాజు ఇంటికి వెళ్లి అతనిని డైరెక్ట్ గా కలిశానని అతని ధైర్యం, దేశభక్తి చూసి షాకయ్యానని నాగచైతన్య అన్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి సైతం ఉత్తరాంధ్ర స్లాంగ్ లోనే మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నారని తెలుస్తోంది.

తండేల్ సినిమా రిలీజ్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ నిర్మాతలు ఈ సినిమాకు సోలో రిలీజ్ డేట్ కోసమే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. డిసెంబర్ టార్గెట్ గా ఈ సినిమా షూట్ జరుపుకుంటోంది. ఆ సమయంలో ఈ సినిమా విడుదలైతే క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు సైతం ఈ సినిమాకు ప్లస్ అవుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus