యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR).. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దివంగత నటుడు హరికృష్ణ (Harikrishna) గారి చిన్నబ్బాయిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ కి.. అతని తాతగారి పోలికలు ఉండటం వల్ల బాగా కలిసొచ్చి వెంటనే స్టార్ అయ్యాడు అని అంతా అనుకుంటారు. కానీ అతని కెరీర్ ప్రారంభంలో కుటుంబం అతనికి అండగా నిలబడింది లేదట. అందుకే కొత్త నటుల్లానే అతను కూడా బాగా కష్టపడాల్సి వచ్చిందట.
కానీ ఎన్టీఆర్ ఆ కష్టాన్ని ఎప్పుడూ లెక్కచేయలేదట. ఆ స్వభావమే అతన్ని స్టార్ గా నిలబెట్టింది అని అతని స్నేహితులు చెబుతూ ఉంటారు. ‘స్టార్ ఫ్యామిలీస్ నుండీ వచ్చిన హీరోలకి సినీ కెరీర్ అంతా పూలపాన్పు మాదిరి ఉంటుంది’ అనుకునేవాళ్లు ఎక్కువ. కొంతవరకు అది నిజం కూడా..! కానీ ఎన్టీఆర్ విషయంలో అలా జరగలేదు. అందుకే అతను చాలా స్పెషల్. ఒకానొక టైంలో అతని స్నేహితుడు, అతనితో రెండు సినిమాలు నిర్మించిన నిర్మాత, ఇప్పటి ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని ఎన్టీఆర్ పడ్డ కష్టాల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
కొడాలి నాని మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్. అతని టాలెంట్ వల్లే ఈరోజు అతను స్టార్ అయ్యాడు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే నైపుణ్యం కలిగిన నటుడు. మొదటి నుండీ అతన్ని ఫ్యామిలీ తక్కువ చేసి చూసింది. కనీసం అతన్ని కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కూడా ఆహ్వానించింది లేదు. మొదట్లో అతని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినా..
అతనికి ఇవ్వాల్సిన పారితోషికం నిర్మాతలు ఎగ్గొట్టారు. అంతేకాదు అతను సినిమా యూనిట్ తో కలిసి లైన్లో నిలబడి భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి. హీరో అయినప్పటికీ తినేటప్పుడు ఇతనికి మొదట్లో కుర్చీ కూడా వేయకుండా అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఒక్క రకంగా కాదు.. పెద్ద కుటుంబానికి చెందిన హీరో అయినప్పటికీ అతను కొత్త నటుడులానే అన్ని కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.