Shyamala, Pawan Kalyan: అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ లేదు : యాంకర్ శ్యామల

  • May 4, 2024 / 04:18 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై యాంకర్ శ్యామల (Shyamala) చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.రాజకీయాల పరంగా కూడా వారంతా జనసేన పార్టీకి సపోర్ట్ చేసేవారే. అయితే పవన్ కి పోటీగా అక్కడ వైసిపి నుండి వంగా గీతా పోటీ చేస్తున్నారు. మరోపక్క వైసిపి పార్టీ తరఫున ప్రచారంలోకి దిగిన ప్రముఖ యాంకర్, సినీ నటి అయిన శ్యామల ..మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.

శ్యామల మాట్లాడుతూ.. “గ్రౌండ్ లెవల్లో ఉన్న రియాలిటీ జనాలకు తెలుసు.. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్పుకుంటారు.. కానీ జరిగేది జరుగుతుంది. అది మనం చూస్తాము. వైసీపీ గెలుపు ఖాయం. వంగా గీత రాజకీయ ప్రస్థానాన్ని చూసుకుంటే.. ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు అనేది అందరికీ తెలుసు. చుట్టూ ఉన్న ప్రజల కోసం ఆమెకు చేతనైనంత చేసుకుంటూ వచ్చారు. చిన్న పొజిషన్ నుండి వచ్చి కూడా ఆమె వల్ల అయినంత సేవ చేశారు.

ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ ని కొట్టాలంటే పవన్ కి సపోర్ట్ అవసరం.జబర్దస్త్ టీమ్ పని చేస్తున్నారంటే అందుకు ఒత్తిళ్లు, రకరకాల కారణాలు ఉండొచ్చు. పిఠాపురంలో వంగా గీత గెలుపు ఎప్పుడో ఖాయం అయ్యింది. నేను ప్రచారంలో భాగంగా వంగా గీతను కలవడానికి కారణం.. భారీ మెజారిటీతో ఆమెను గెలిపించడానికే” అంటూ పవన్ ఫ్యాన్స్ కి చురకలు అంటించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus