యమున మాటల్లో విన్నర్ ఎవరో తెలిసిపోయిందా ? అసలు జరిగింది ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామీలీ మెంబర్స్ రావడం అనేది ప్రతి సీజన్ లో జరుగుతూనే ఉంటుంది. ఈసారి ఓటీటీలో కూడా ఫ్యామీలీ ఎమోషన్స్ ని పండించేందుకు బిగ్ బాస్ ఒక్కొక్కరి ఇంటి సభ్యుల కుటుంబసభ్యులని పంపిస్తున్నాడు. ఇందులో భాగంగా యాంకర్ శివ వాళ్ల చెల్లి యమున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యాంకర్ శివతో , బిందుతో చాలాసేపు మాట్లాడింది. హౌస్ మేట్స్ అందర్నీ పలకరిస్తూ హౌస్ అంతా తిరుగుతూ హడావుడి చేసింది. ఇక్కడే బిందు మాధవి , యాంకర్ శివల గేమ్ చాలా బాగుందని, అందరికీ నచ్చుతోందని హింట్ ఇచ్చింది.

అందరికీ అంటూ స్ట్రెస్ చేసి మరీ చెప్పింది. బెడ్ పైన మీరిద్దరూ కూర్చుని ఉన్నా కూడా చేసే ఫన్ చాలా బాగుందని హింట్ ఇచ్చింది. ఇక్కడే బిందు మాధవి కొన్ని లెక్కలు వేసుకోవడం ప్రారంభించింది. బెడ్ పైన కూర్చుని ఉన్నా కూడా ఫన్ జనరేట్ అయ్యిందని యమున చెప్పిన మాటలు, అలాగే బెడ్ పైన మాత్రమే కూర్చుంటున్నావ్ పని చేయట్లేదని చెప్పిన అషూ మదర్ మాటలకి పొంతన లేదని శివతో చెప్పింది. అంతేకాదు, యుమున మాట్లాడుతున్నప్పుడు గార్డెన్ ఏరియాలో విన్నర్ ఎవరు మా ఇద్దరిలోనే ఒకరా అంటూ అడిగింది.

దీనికి హూ.. అని తలూపిన యమున, ఎవరైనా కావచ్చు. చెప్పలేం అంటూ మళ్లీ వెంటనే కవర్ చేసింది. బిందు మాధవి షార్ప్ గా యుమున చెప్పిన పాయింట్స్ ని క్యాచ్ చేసింది. ఇక ఇల్లంతా తిరుగుతూ లగ్జరీ బడ్జెట్ ని సైతం ప్రారంభించింది యమున. అయితే, యమున మాటల్లో గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అనేది హౌస్ మేట్స్ ఒక అంచనాకి వచ్చేశారు. అలాగే, నటరాజ్ మాస్టర్ , అఖిల్ లు కూడా యమునని పలకరిస్తూ మీ అన్నని తిడుతున్నామని కోపమా అంటూ మాట్లాడారు. అదేం లేదని, గేమ్ లో అన్నా కామనే కదా అంటూ మాట్లాడింది యమున.

చాలాసేపు ఇంట్లో ఉన్న యమునకి మిత్రా తన జ్యూవెలరీ బాక్స్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. అలాగే, ప్రేమగా అన్నం కలిపి రెండు స్పూన్స్ పెట్టాడు యాంకర్ శివ. యమున ఇంట్లో నుంచీ వెళ్లిపోయిన తర్వాత అషూ మదర్ వచ్చి ఇల్లంతా సందడి చేసింది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ వైఫ్ నీతు, పాప ఇద్దరూ రావడం చాలాసేపు పాప హౌస్ లో ఉండటం ఎపిసోడ్ లోనే హైలెట్ అని చెప్పాలి. అదీ మేటర్.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus