బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదనుకుంట. ఈమె యాక్టివ్ నెస్ ఎదుటివారిలో కూడా ఎనర్జీ నింపేలా ఉంటుంది అని గతంలో చాలా మంది సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు.! స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి స్థానం ప్రత్యేకం. కుర్రకారుని ఈమె బాగా ఆకర్షిస్తుంది. ‘పటాస్’ ప్రోగ్రామ్ తో యూత్ కు దగ్గరైన శ్రీముఖి.. ‘బిగ్ బాస్3’ రియాలిటీ షో ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా దగ్గరయింది. ఆ షో ద్వారా ప్రతీ ఒక్కరి ఇళ్లలోనూ అక్కగా మారిపోయింది శ్రీముఖి.
చెప్పాలంటే ‘బిగ్ బాస్3’ లో శ్రీముఖినే విన్నర్ అవుతుందని అంతా ఆశించారు.కానీ అది జరగకపోవడంతో అంతా నిరుత్సాహపడ్డారు.సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రస్తుతం బిజీ యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి .. సడన్ గా తాను పెళ్లికి రెడీ అవుతున్నట్టు చెప్పి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇటీవల సుమ హోస్ట్ చేస్తున్న ఓ షోలో పాల్గొన్న శ్రీముఖి.. ‘2 ఏళ్ళల్లో పెళ్లి చేసుకుని.. ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ప్రకటిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది.
శ్రీముఖి చేసిన ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.’మంచి పేరు ఉన్నప్పుడే మర్యాద పూర్వకంగా రిటైర్మెంట్ తీసుకోవడం చాలా ఉత్తమం’ అని కొంతమంది సీనియర్ హీరోయిన్స్ గతంలో చెప్పుకొచ్చారు. బహుశా శ్రీముఖి మనసులో కూడా అదే ఉందేమో..! అయినా ఇంకా రెండేళ్ల తరువాత కదా శ్రీముఖి పెళ్లి చేసుకుని రిటైర్ అయ్యేది. అప్పటివరకూ తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో అలరిస్తూనే ఉంటుంది లెండి..! ‘జులాయి’ ‘నేను శైలజ’ ‘జెంటిల్మెన్'(2016) వంటి చిత్రాల్లో కూడా శ్రీముఖి నటించిన సంగతి తెలిసిందే.
బిగ్బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!