టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ సుమ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు అమ్మాయిగా ఈమె సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా కెరియర్ మొదట్లో పలు సీరియల్స్ లో నటించిన ఈమె అనంతరం పలు సినిమాలలో హీరో చెల్లి అక్క పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈమె ప్రస్తుతం సీరియల్లకు దూరంగా ఉన్నప్పటికీ యాంకర్ గా మాత్రం కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే శ్యామల యాంకర్ గా ఎన్నో సినిమా ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది.
ఇలా ఒకవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోని తాజాగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈమె అచ్చం పెళ్లికూతురు లాగా ఎంతో అందంగా ముస్తాబయి పల్లకిలో ఊరేగింపుగా తీసుకువస్తున్నారు.
ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఎంతోమంది నెటిజెన్లు ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలా రావడం తన కల అంటూ శ్యామల చెప్పుకొచ్చారు. తన పెళ్లిలో ఇలా అందంగా ముస్తాబయి రావాలని తాను కలలు కన్నట్టు ఈమె వెల్లడించారు. యాంకర్ శ్యామల వివాహం మాత్రం పెద్దల సమక్షంలో ఘనంగా జరగలేదు
ఈమె నటుడు నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఈమె పెళ్లి చాలా సింపుల్ గా జరిగిందని అయితే పెళ్లిలో తీరని ఈ కోరిక ఇలా నెరవేరింది అంటూ ఈ సందర్భంగా శ్యామల ఈ వీడియో గురించి తెలియజేస్తూ ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది