Vishnu Priya: బ్రేకప్, ఫస్ట్ కిస్ పై యాంకర్ విష్ణుప్రియ బోల్డ్ కామెంట్స్ వైరల్!

పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన విష్ణుప్రియ.. అటు తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించింది కానీ పెద్దగా జనాలకు రిజిస్టర్ కాలేకపోయింది. అయితే బుల్లితెర ‘పోవే పోరా’ వంటి షోలతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అమ్మడు ఇంకా ఫేమస్ అనే చెప్పాలి. కురచ దుస్తుల్లో..పలు మాస్ పాటలకి ఈ అమ్మడు చేసే డాన్స్ లు మామూలుగా ఉండవు.

సోషల్ మీడియాలో విష్ణుప్రియకి భీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పాలి. అయితే ఫిజిక్ విషయంలో ఈమెను ట్రోల్ చేసే బ్యాచ్ కూడా లేకపోలేదు. అయితే జనవరి చివర్లో తన తల్లి మరణించడంతో డీలా పడిపోయిన విష్ణు ప్రియ.. ఇప్పుడిప్పుడే మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుంది. తాజాగా విష్ణుప్రియ తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది. ఇందులో భాగంగా ఆమె లవ్ ఫెయిల్యూర్, ఫస్ట్ కిస్ వంటి విషయాల పై బోల్డ్ గా స్పందించింది.

విష్ణుప్రియ మాట్లాడుతూ.. “నాకు పర్సనల్ లైఫ్, రెస్పాన్సిబిలిటీస్ వంటివి ఉన్నాయి. నా లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ లేక బాధపడుతున్నా. ఒకవేళ వాడున్నా… నా టైమ్ అంతా వృధా అయిపోయేదేమో. రిలేషన్షిప్ లో ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. ఇప్పటిదాకా నేను బ్రేకప్ చెప్పిన బాయ్ ఫ్రెండ్స్ ని దూరం పెట్టకుండా.. ఇంకా వాళ్ళని ఫ్యామిలీగా చూసుకుంటాను. ఇక నా ఫస్ట్ కిస్ కాదు కానీ ఫస్ట్ ఆన్ స్క్రీన్ కిస్ మాత్రం..

17 ఏళ్లకే జరిగింది.నేను బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్తానా లేదా? అని కొంతమంది అడుగుతున్నారు.బిగ్ బాస్ తెలుగు షోపై అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ హిందీ బిగ్ బాస్ లో అవకాశం వస్తే కచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే.. తెలుగులో బాగా ఆడేవాళ్లు కూడా ఓడిపోతుంటారు.అందుకే ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు” అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus