ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటికొచ్చింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ‘జీ’ తెలుగు ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్‌కు ముందే శాటిలైట్ డీల్ క్లోజ్ అవ్వడంతో, చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఒక సాధారణ సినిమా అభిమాని కథతో తెరకెక్కుతోంది. ఇందులో సూపర్ స్టార్ ‘ఆంధ్రా కింగ్’ పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తుండటం సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. యాక్షన్ చిత్రాల తర్వాత రామ్‌ను పూర్తి భిన్నమైన పాత్రలో ఈ సినిమా చూపించనుంది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ సంగీత ద్వయం వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అనిరుధ్ పాడిన ‘నువ్వుంటే చాలే’ అనే ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో 18 మిలియన్లకు పైగా వ్యూస్‌తో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. భారీ తారాగణం, క్రేజీ కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.