నటసింహ నందమూరి బాలకృష్ణ జెట్ స్పీడ్‌తో సినిమాలు లైనప్ చేస్తున్నారు. ఈ వయసులోనూ యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తూ.. క్రేజీ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తున్నారు. అది కూడా యువ దర్శకులతో కావడం విశేషం.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ‘వీర సింహా రెడ్డి’ షూటింగ్ చివరి దశలో ఉంది..క్రాంతికి సినిమాని బాక్సాఫీస్ బరిలో దింపడానికి ఫుల్ జోష్‌తో పనిచేస్తోంది మూవీ టీం. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీస్థాయిలో జరిగింది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టడానికి సన్నాహాలు మొదలెట్టేశారు.
బాలయ్య తన 108వ సినిమాని వరుసగా ఆరు హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఫుల్ స్వింగ్‌లో ప్రీ ప్రొడక్సన్ వర్క్ కంప్లీట్ చేస్తోంది టీమ్.. డిసెంబర్ 8న పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించాలనుకుంటున్నారు యూనిట్. 8వ తేదిన బాలయ్య ఓ మంచి మూహుర్తం ఫిక్స్ చేశారట.అనిల్ రావిపూడి ఈ మూవీలో నటసింహాన్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్..
అవతార్‌లో చూపించబోతున్నాడని టాక్.. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగానే కాకుండా.. ఆయనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే కొత్త కథ, కథనాలతో సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఏజ్డ్ క్యారెక్టర్లో కనిపించబోయే బాలయ్యకి ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీల కూతురిగా కనిపించనుంది. ప్రస్తుతం ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సెలెక్షన్ జరుగుతుందని తెలుస్తోంది. బిందు మాధవి ఓ కీలకపాత్రలో కనిపించే అవకాశముందని అంటున్నారు. బాలయ్యకి అనిల్ ఓ ప్రామిస్ చేశాడట..
‘తమ్ముడు’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన పి.ఎ. అరుణ్ ప్రసాద్ తర్వాత బాలయ్యతో (నరసింహ నాయుడు) తర్వాత ‘భలేవాడివి బాసూ’ అనే డిజాస్టర్ ఇచ్చాడు.. తను అలాంటి పొరపాటు చేయనని.. ఎట్టి పరిస్థితిలోనూ పక్కా సూపర్ హిట్ ఇస్తానని బాలయ్యకి మాటిచ్చాడట అనిల్.. జయం, పరాజయం అనేవి దైవాధీనాలు.. వాటికెవరూ అతీతం కాదు.. నీ పని నువ్వు చేశావ్ కానీ ఫలితం ఊహించలేదుగా అని బాలయ్య బదులిచ్చారట.. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది..