Balayya Babu: బాలయ్య అనిల్ మూవీ అధికారక ప్రకటన అప్పుడేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కాకుండా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా ఫిక్స్ అయింది. అయితే బాలయ్య అనిల్ కాంబో మూవీ ఎప్పటినుంచి మొదలవుతుందో అర్థం కాక బాలయ్య అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఈ ఏడాది ఆగష్టు 15వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

దసరా పండుగ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన అనిల్ రావిపూడి ప్రస్తుతం స్క్రిప్ట్ ను తుది మెరుగులు దిద్దుతున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య స్టైల్ లో అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది. టాలీవుడ్ సీనియర్ హీరోలందరి సినిమాలకు దర్శకత్వం వహించాలని భావిస్తున్న అనిల్ రావిపూడి ఇప్పటికే వెంకటేష్ తో రెండు సినిమాలను తెరకెక్కించారు.

బాలయ్యతో త్వరలో అనిల్ రావిపూడి సినిమాను తెరకెక్కించనుండగా రాబోయే రోజుల్లో చిరంజీవి, నాగార్జునలతో కూడా అనిల్ రావిపూడి సినిమాలను తెరకెక్కించే ఛాన్స్ యితే ఉంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా సాహో గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. 62 సంవత్సరాల వయస్సులో కూడా బాలయ్య వరుసగా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం.

బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది. తర్వాత సినిమాలు కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటే బాలయ్య మార్కెట్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. బాలయ్య ఒక్కో సినిమాకు 12 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus