Anil Ravipudi: సీనియర్ హీరోలపై అనిల్ దృష్టి పెట్టడానికి కారణాలివే!

ఈతరం స్టార్ హీరోలలో చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలపై, పాన్ ఇండియా డైరెక్టర్లపై దృష్టి పెడుతున్నారు. అయితే అనిల్ రావిపూడి మాత్రం పాన్ ఇండియా కథలకు, ఆ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అందువల్ల అనిల్ రావిపూడి సీనియర్ స్టార్ హీరోలపై దృష్టి పెట్టారు. సీనియర్ స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ పై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఈ హీరోలతో సినిమాలను తెరకెక్కించి విజయాలను అందుకోవాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు.

ఇప్పటికే వెంకటేష్ తో రెండు సినిమాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి త్వరలో బాలకృష్ణతో ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే చిరంజీవి, నాగార్జునలతో కూడా సినిమాలను తెరకెక్కించాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా అంటే చిరంజీవి, నాగార్జున నో చెప్పే ఛాన్స్ కూడా లేదు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోలలో చిరంజీవి, నాగార్జున ముందువరసలో ఉంటారు. బాలయ్యను కొత్తగా చూపిస్తానని అభిమానులకు వెల్లడించిన అనిల్ రావిపూడి చిరంజీవి, నాగార్జునలను ఏ విధంగా చూపిస్తారో చూడాల్సి ఉంది.

Direct

నాగార్జున డేట్స్ దొరకడం సులువే అయినా చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో మెగాస్టార్ డేట్స్ దొరకడం సులువు కాదు. జగదేక వీరుడు అతిలోక సుందరి, మాయాబజార్ లాంటి సినిమాలను తీయాలని తన కోరిక అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటంతో అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ సైతం పెరిగిందని తెలుస్తోంది. చిరంజీవి, నాగార్జున అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు ఎన్టీఆర్, మహేష్ బాబులతో కూడా సినిమాలను తెరకెక్కించాలని అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఎఫ్3 సినిమాకు అనిల్ రావిపూడి 18 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus