మహేష్ దర్శకుడి ప్లానింగ్ సూపర్..!

Advertisement

అపజయమెరుగని దర్శకుల్లో .. రాజమౌళి, కొరటాల శివ తరువాత అనిల్ రావిపూడి కూడా చేరిన సంగతి తెలిసిందే. నాలుగు సినిమాలు మీడియం రేంజ్ హీరోలతో తెరకెక్కించిన అనిల్ రావిపూడి.. తన 5వ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించే ఛాన్స్ కొట్టేసాడు. ఈ ఏడాది విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే తరువాత ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ కూడా ప్లాన్ చేసుకున్నాడు కానీ.. అది వర్కౌట్ కావడం లేదు.

వెంకటేష్ ‘నారప్ప’ షూటింగ్ ను ఫినిష్ చెయ్యాలి.. పైగా మధ్యలో రానా పెళ్లి కూడా ఉంది. ఇక వరుణ్ తేజ్ కూడా.. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.అదీ ఫినిష్ కావాల్సి ఉంది. కాబట్టి ఆ ఇద్దరు హీరోలు ఇప్పట్లో ఖాళీ అయ్యే ఛాన్స్ లేదు. అందుకే అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తన దగ్గర ఉన్న ఓ స్పోర్ట్స్ డ్రామాని డెవలప్ చేసుకుని.. ఎవరైనా మీడియం రేంజ్ హీరోతో దానిని తెరకెక్కించాలి అని ప్లాన్ చేస్తున్నాడట.

3 నెలల్లోనే ఈ చిత్రం ఫినిష్ చేసేలా పక్కా ప్లాన్ తో ఉన్నాడట అనిల్. చెప్పాలంటే.. అనిల్ చేస్తుంది మంచి పనే అని చెప్పాలి. ఎందుకంటే వైరస్ మహమ్మారి వల్ల పెద్ద హీరోల కమిట్మెంట్స్ మొత్తం మారిపోయాయి. వాళ్ళ కోసం ఎదురుచూడకుండా.. అప్పట్లో ఇవివి సత్యనారాయణ గారి లానే మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తే.. బాక్సాఫీస్ కళకళలాడుతుంటుంది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus