Anirudh: అనిరుథ్ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్ ఇచ్చాడా?
- August 15, 2026 / 09:45 AM ISTByFilmy Focus Desk
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్, ప్రముఖ యవ వ్యాపారవేత్త కావ్యా మారన్ పెళ్లి జరగనుంది, జరుగుతుంది, జరగబోతోంది అంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఐపీఎల్ సీజన్ వచ్చినట్లు.. ఏటా వీరి పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి అని చెబుతూ ఉంటారు. ఈ రూమర్ ఎందుకు, ఎలా పుట్టుకొస్తుందో తెలియదు కానీ.. బాగా దగ్గరి వాళ్లే చెప్పారు అని కూడా సోర్స్‌ల పేర్లు వస్తుంటాయి.
Anirudh
ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. ఇప్పుడు అనిరుథ్‌కి అయితే పెళ్లి మీదకు ధ్యాస వచ్చింది అని చెప్పొచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘‘అందరూ మీ వల్లే పెళ్లి చేసుకున్నాం అని చెబుతుంటారు. అలాంటప్పుడు నాకు ఎందుకు పెళ్లి కావడం లేదు అని నేను తిరిగి అడుగుతాను’’ అని చెప్పారు అనిరుథ్. ఈ మాటల ప్రకారం పెళ్లి కోసం అనిరుథ్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు అంటూ ఓ చర్చ మొదలైంది.

రీసెంట్‌గా వీరి వివాహం గురించి ఓ వార్త బయటికొచ్చింది. అనిరుధ్, కావ్య మారన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అనిరుధ్‌కు బంధువైన సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వారి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ఓకే చెప్పినట్లు తెలిపారు. అక్కడికి కొన్ని నెలలు ముందు ఈ పెళ్లి రూమర్లను అనిరుథ్ కొట్టిపడేశారు. అయితే మహేంద్రన్ మాట్లాడక అనిరుథ్ నుండి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇది నిజం అవ్వొచ్చేమో అనే చర్చ మొదలైంది.
ఓవైపు అనిరుథ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. మరోవైపు కావ్య వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. మరి పెళ్లికి ఎప్పుడు డేట్స్ ఇస్తారు అనేది చూడాలి. అంతా ఓకే అయితే.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాట హర్షితే చేస్తారు.











