Anirudh: టాలీవుడ్ ఇండస్ట్రీలో అనిరుధ్ కెరీర్ ను డిసైడ్ చేయనున్న దేవర.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్, థమన్ మధ్య గట్టి పోటీ ఉంది. ఎంతోమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు, ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. థమన్, దేవిశ్రీ ప్రసాద్ లకు వాళ్లు గట్టి పోటీ ఇవ్వడంలో ఫెయిలవుతున్నారు. అయితే దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అనిరుధ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమాకు కేజీఎఫ్, సలార్ రేంజ్ బీజీఎం కావాలని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనిరుధ్ (Anirudh) కెరీర్ ను దేవర మూవీ డిసైడ్ చేయనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ వల్లే దేవర షూట్ ఆలస్యమవుతోందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అజ్ఞాతవాసి విషయంలో కొన్ని చిన్నచిన్న తప్పులు చేసిన అనిరుధ్ దేవర మాస్ మూవీ కావడంతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవర సినిమాకు అనిరుధ్ రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా గ్లింప్స్ రిలీజ్ తో బాక్సాఫీస్ షేక్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం సంథింగ్ స్పెషల్ గా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఫిబ్రవరి రెండో వారం సమయానికి దేవర షూట్ పూర్తి కానుందని తెలుస్తోంది.

గోవాలో, గోకర్ణలో, హైదరాబాద్ లో ఈ సినిమాలోని మెజారిటీ సీన్లను షూట్ చేయడం జరిగింది. దేవర సినిమా కోసం ఇతర భాషల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా నటులకు ఈ సినిమాలో ప్రాధాన్యత దక్కింది. దేవర సినిమాలో శ్రీకాంత్ రోల్ మరింత స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానున్న దేవర బాక్సాఫీస్ ను షేక్ చేయనుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus