Anitha Chowdhary: బాలయ్య గొప్పదనం గురించి చెప్పిన అనితా చౌదరి.. ఏమన్నారంటే?

  • September 12, 2023 / 06:44 PM IST

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది తక్కువ సినిమాలే అయినా అనితా చౌదరి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రముఖ నటి బాలయ్య గొప్పదనం గురించి చెప్పగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నా లైఫ్ లో రెండు యాక్సిడెంట్స్ జరిగాయని ఆ యాక్సిడెంట్స్ మేజర్ యాక్సిడెంట్స్ అని ఆమె అన్నారు. ఒక సందర్భంలో కారు డ్రైవర్ చేసిన తప్పు వల్ల మా కారును ఒక ట్రక్ గుద్దెసీందని అనితా చౌదరి తెలిపారు.

ఆ సమయంలో నా కాలర్ బోన్ విరిగిపోయిందని ఆ సమయంలో ఏదో ఒక విధంగా కోలుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. కేరింత సినిమా సమయంలో మరోసారి యాక్సిడెంట్ కాగా ఆ సమయంలో డిస్క్ విరిగిందని బాలయ్య దగ్గరుండి ఆ సమయంలో చికిత్స చేయించడం జరిగిందని అనితా చౌదరి పేర్కొన్నారు. బాలయ్య తన ఆస్పత్రి నుంచి వైద్యులను తీసుకొచ్చి చికిత్స అందేలా చూశారని ఆమె అన్నారు.

బాలయ్యకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక యువతి ద్వారా బాలయ్యకు నా (Anitha Chowdhary) యాక్సిడెంట్ గురించి తెలిసిందని అనితా చౌదరి పేర్కొన్నారు. బాలయ్య నా కుటుంబ సభ్యులతో మాట్లాడి చికిత్స చేయించడంతో పాటు బాలయ్య నా విషయంలో చాలా కేర్ తీసుకున్నారని అనితా చౌదరి చెప్పుకొచ్చారు. అనితా చౌదరి చెప్పిన విషయాలు బాలయ్యపై గౌరవాన్ని మరింత పెంచుతున్నాయి.

బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీ వచ్చే నెల 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. శ్రీలీల, కాజల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా వీళ్లిద్దరికీ ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus