Anjali: అంజలి ఆశల్ని వకీల్ సాబ్ నెరవేరుస్తాడా..?

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ మూవీ వచ్చే శుక్రవారం రోజున విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తోంది. తెలుగమ్మాయి అంజలి వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటంతో ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో పాటు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సినిమా విషయంలో చేసిన మార్పులు తనకు ఎంతగానో నచ్చాయని ఆమె పేర్కొన్నారు. పింక్ సినిమాకు వకీల్ సాబ్ రీమేక్ అయినప్పటికీ ఆ సినిమాతో పోల్చడానికి వీలు లేని విధంగా మార్పులు జరిగాయని అంజలి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ సెట్ లో ఉన్నారంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేదని మొదట్లో పవన్ తో నటించడం తనకు కొంచెం ఇబ్బందిగానే ఉండేదని అంజలి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తనకు ఇన్ పుట్స్ ఇచ్చారని చాలా తక్కువ సమయంలో నివేదా థామస్,

అనన్యలతో తనకు బాండింగ్ ఏర్పడిందని అంజలి అన్నారు. పవన్ కళ్యాణ్ సెట్ లో కామ్ గా, డిగ్నిఫైడ్ గా ఉంటారని.. పవన్ తో మాట్లాడాలంటి తనకు 15 రోజుల సమయం పట్టిందని ఆమె తెలిపారు. ఈ సినిమాలో తన పాత్రకు ప్రత్యేక స్థానం ఉందని అంజలి పేర్కొన్నారు. సినిమా ట్రైలర్ లో డబ్బులు తీసుకున్నామని చెబుతానని ఆ సీన్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉందో చెబుతుందని అంజలి పేర్కొన్నారు. ఆ కోర్టు చేసిన సమయంలో తాను గజగజా వణికిపోయానని అంజలి అన్నారు.

నటుడు ప్రకాష్ రాజ్ ను గారితో వకీల్ సాబ్ సినిమాలో మరోసారి కలిసి నటించే అవకాశం దక్కిందని.. ప్రకాష్ రాజ్ తో కలిసి పని చేసే సమయంలో ఆ ఎనర్జీ మనకు కూడా వస్తుందని ఆమె పేర్కొన్నారు. వకీల్ సాబ్ పై ఆశలు పెట్టుకున్న అంజలి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus